అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Akhil Akkineni wedding date: హీరో అక్కినేని నాగార్జున ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. అఖిల్, జైనాబ్ వివాహంను ఇరు కుటుంబాలు మార్చి 24వ తేదీని ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్, జైనాబ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 24న అఖిల్ పెళ్లి కాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. అఖిల్ పెళ్లిని గ్రాండ్ గా జరిపేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులో పాటు క్రికెటర్లను కూడా ఆహ్వానించనున్నారని టాక్.
అఖిల్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఢిల్లీకి చెందిన ఆర్టిస్ట్ జైనాభ్ రవడ్జీతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అఖిల్.. ఇటీవలే ఆ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఇరువురు రింగులు మార్చుకున్నారు. ఈ గుడ్‌ను స్వయంగా నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అఖిత్, జైనాభ్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ వారి నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఇటీవలే నాగచైతన్య-శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరిగింది. అయితే అఖిల్ పెళ్లి కూడా మార్చి 24న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పెళ్లి తేదీ దగ్గరపడుతుండడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే గతంలో అఖిల్‌కు ఓ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.
ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అఖిల్.. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా రాయలసీమలోని ఓ పల్లెటూరిలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అఖిల్ కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ మధ్య అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు పెద్ద మొత్తంలో లాస్ వచ్చింది. మరి ఇప్పుడు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.