Akhanda 2: ‘అఖండ 2’ ఎమోషనల్ సాంగ్ రిలీజ్..!
Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది.
Akhanda 2: ‘అఖండ 2’ ఎమోషనల్ సాంగ్ రిలీజ్..!
Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది. మరికొన్ని గంటల్లో ఆయన నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ 2' (Akhanda 2 Thaandavam) థియేటర్‌లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని ఉధృతం చేసింది. తాజాగా, ఈ సినిమాలోని 'శివ శివ..' అంటూ సాగే ఒక ఉద్వేగభరితమైన (ఎమోషనల్) ఆడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విడుదలైన 'శివ శివ' పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి అర్థవంతమైన సాహిత్యాన్ని అందించగా, ప్రముఖ గాయనీమణులు కనకవ్వ, శ్రుతి రంజనీ తమ గాత్రంతో పాటను మరింత శక్తివంతం చేశారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.