Aishwarya Rajesh: రిలేషన్ షిప్‌లో రెండు సార్లు వేధింపులు ఎదుర్కొన్నా.. ఐశ్వర్య రాజేష్
నటి ఐశ్వర్య రాజేష్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది తెలుగులో విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య.. తన సినీ కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
రిలేషన్ షిప్‌లో రెండు సార్లు వేధింపులు ఎదుర్కొన్నా.. ఐశ్వర్య రాజేష్
Aishwarya Rajesh: నటి ఐశ్వర్య రాజేష్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది తెలుగులో విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య.. తన సినీ కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తన తల్లి ఎంతో కష్టపడి తమని పెంచారని అన్నారు. తన తల్లి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన అవకాశాలతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు.
తన తల్లిదండ్రులకు తాము నలుగురు సంతానమని.. చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో ఎంతో కష్టపడ్డామని చెప్పారు. తమ తల్లి ఒక్కరే కష్టపడి తమను పెంచారని అన్నారు. ఆమెకు అండగా ఉండాలని చిన్న వయస్సులోనే పార్ట్ టైం ఉద్యోగాలు చేసినట్టు చెప్పారు. సినిమాల్లోకి అడుగుపెట్టి నచ్చిన కథలతో ముందుకు సాగుతున్నాను. నా తల్లిని చూసుకుంటున్నాను.. అందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు ఐశ్వర్య.
రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ ఒకటి కాదు రెండు సార్లు వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. లవ్ కంటే కూడా బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే తనకెంతో భయమన్నారు. తాను చాలా ఎమోషన్ అని. ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు రావడానికి చాలా టైం తీసుకుంటానన్నారు. తాను ప్రేమించిన వ్యక్తి నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. అతడితో బ్రేకప్ అయ్యాక మళ్లీ అదే నరకంలోకి అడుగుపెట్టానని అన్నారు. రెండోసారి ప్రేమించిన వ్యక్తి కూడా తనను వేధించాడని.. ఆ వేధింపులు ఎలా ఉండేవంటే తనపై చేయి చేసుకునేవారని చెప్పారు. తాను ఎంతగానో ప్రేమిస్తే ఇలా జరుగుతుందేంటా అని బాధపడ్డానని.. రెండు రిలేషన్ షిప్స్‌లో వేధింపులు అనుభవించడంతో మళ్లీ ప్రేమలో పడాలంటేనే భయమేస్తోందని చెప్పారు.
తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనేది తన కోరిక అన్నారు. రాజమౌళి, శేఖర్ కమ్ములతో పని చేయాలని ఉందని.. జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానినని చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ఇకపోతే రెండు జెళ్ల సీత, ఆనంద భైరవి వంటి చిత్రాల్లో నటించిన అలనాటి నటుడు రాజేష్ కుతురిగా ఐశ్వర్య రాజేష్ అందరికి సుపరిచితురాలు. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్‌లో నటించారు. అందులో సువర్ణ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్‌కు జోడీగా భాగ్యం పాత్రలో నటించి అలరించారు.