Aishwarya rai: కేన్స్‌లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా ఐశ్వర్య.. నుదుట బొట్టుతో
సినిమా ఈవెంట్‌లంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తారల దుస్తులే.
Aishwarya rai: కేన్స్‌లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా ఐశ్వర్య.. నుదుట బొట్టుతో
Aishwarya rai: సినిమా ఈవెంట్‌లంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తారల దుస్తులే. ముఖ్యంగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోయిన్లు ఏ వేదికపై కనిపించినా ప్రత్యేకతగల స్టైల్‌తో ఆకట్టుకుంటారు. తాజాగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ 2025 ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె హాజరై మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. చీరకట్టు, నుదుట సిందూరంతో సంప్రదాయాన్ని మెరిపించిన ఐష్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
78వ కేన్స్ చలనచిత్రోత్సవాలు ఈ మధ్యే ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన ఐశ్వర్య, హాఫ్ వైట్ కలర్ బెనారసీ చీర, మెటాలిక్ టిష్యూ డ్రేప్, దానికి మ్యాచ్ అయ్యే సంప్రదాయ నగలు ధరించి అందంగా మెరిశారు. ఆమె మెడలో వేసుకున్న 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులతో పాటు వజ్రాల హారాలు, మణిపుష్పాలతో అలంకరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చీరను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
అయితే ఆమె లుక్‌లో అసలైన హైలైట్ సిందూరం. నుదుట సింధూరం ధరించి అందరినీ అట్రాక్ట్ చేసింది ఐశ్వర్య. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా ఐశ్వర్య తన లుక్ ద్వారా ఓ మెసేజ్ ఇచ్చారంటూ కొందరు అభిమానులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఐశ్వర్య 2002లో తొలిసారి కేన్స్ వేడుకలకు హాజరైనప్పుడు కూడా చీరకట్టులోనే మెరిశారు. అప్పట్లో ఆమె నటించిన దేవదాస్ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎక్కువగా ఫ్యాషన్ గౌన్లతోనే కనిపించినా.. ఈ ఏడాది మాత్రం సంప్రదాయాన్ని, స్టైల్‌ను కలిపి ఐశ్వర్య రెడ్ కార్పెట్‌పై మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.