Adivi Shesh :'డెకాయిట్' గ్లింప్స్ విడుదల.. ఇంటెన్స్ లుక్‌లో యంగ్ హీరో!
Adivi Shesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Adivi Shesh :'డెకాయిట్' గ్లింప్స్ విడుదల.. ఇంటెన్స్ లుక్‌లో యంగ్ హీరో!
Adivi Shesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో కథ, స్క్రీన్‌ప్లేను అడివి శేష్, షనీల్ డియో కలిసి అందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఓ గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోందని సమాచారం.
మరోవైపు, ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుండగా, తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంటెన్స్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అడివి శేష్ దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట్‌ను గమనిస్తూ కనిపించిన విధంగానే, తాజా గ్లింప్స్‌లోనూ మెన్షన్ చేశారు. గ్లింప్స్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా, కథ రివీల్ కాకుండా స్మార్ట్‌గా కట్ చేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం — ‘డెకాయిట్’ కథ రెండు మాజీ ప్రేమికుల నేపథ్యంలో నడవనుందని, వారు తమ జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టేందుకు వరుస దోపిడీల ప్రణాళిక వేసుకునేలా కథనం సాగుతుందని తెలుస్తోంది. చివరికి వారి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో, వారి మధ్య సంబంధం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనుంది.