Adivi Sesh Dacoit: ‘డెకాయిట్’ ఆడియో రైట్స్‌కు 8 కోట్ల డీల్.. అడవి శేష్ కెరీర్‌లో హైయెస్ట్..!

Adivi Sesh Dacoit: అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ సినిమాకు భారీ ఆడియో డీల్ ఫిక్స్ అయ్యింది.

Update: 2025-05-24 11:09 GMT

Adivi Sesh Dacoit: అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ సినిమాకు భారీ ఆడియో డీల్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ సోనీ మ్యూజిక్ ఏకంగా రూ. 8 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది అడవి శేష్ కెరీర్‌లో ఇప్పటివరకు అమ్ముడైన అత్యధిక ధరైన ఆడియో రైట్స్‌గా నిలిచింది.

సుప్రియ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు, మాస్ ఆలాపనలతో అభిమానులను ఊరిస్తున్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ అందించిన ‘ధమాకా’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘డెకాయిట్’ మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘మేజర్’, ‘గూఢచారి’ వంటి విజయవంతమైన స్పై థ్రిల్లర్ల తర్వాత, అడవి శేష్ మరోసారి తన స్టైల్‌లో యాక్షన్ థ్రిల్లర్‌కు సిద్ధమవుతున్నాడు. ‘డెకాయిట్’ భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతోంది.

ఇదిలా ఉండగా, ఇటీవల నాని హీరోగా నటించిన ‘పారడైజ్’ సినిమా ఆడియో రైట్స్ రూ. 18 కోట్లకు అమ్ముడవగా, ఇప్పుడు ‘డెకాయిట్’ కూడా రూ. 8 కోట్ల డీల్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ మార్కెట్ ఎంత పెరిగిందో మరోసారి చూపించింది. మిడ్-రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఇంత భారీగా ఆడియో డీల్ కుదరడం, తెలుగు సినిమాల్లో సంగీతానికి ఉన్న క్రేజ్ను స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News