Aditi Rao Hydari: అదితిరావు హైదరి మొదటి భర్త ఎవరు.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..
Aditi Rao Hydari First Husband: ఈ నేపథ్యంలోనే అదితిరావు హైదరి మొదటి భర్త ఎవరు.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటన్నదానిపై ప్రస్తుతం నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
Aditi Rao Hydari
Aditi Rao Hydari First Husband: కొన్నేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్, అదితిరావు హైదరి వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కొన్నిరోజులుగా సహజీవనం చేసిన ఈ జంట తాజాగా గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ఓ పురాతన ఆలయంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అదితి మొదటి భర్త ఎవరు.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటన్నదానిపై ప్రస్తుతం నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఇంతకీ అదితిరావు హైదరి మొదటి భర్త ఎవరు.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదితి సినిమాల్లోకి రాకముందే 2002లో సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే 2012లో భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత సినిమాలపై ఫోకస్ పెంచింది.
ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం సిద్ధార్థతో ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ప్రేమలో వీరు ఈ ఏడాది మార్చి 27 న వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ లోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అదితి మొదటి భర్త సత్యదీప్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ లాయర్‌గా పనిచేశారు. అయితే ఆ తర్వాత ఆయన ముంబైలో అడ్వర్టైజింగ్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. చిల్లరపార్టీ మూవీలో నటించారు. అనంతరం సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఓటీటీ వైపు మొగ్గు చూపారు. పలు సిరీస్లలో కూడా కనిపించారు.. ఇక అదితి రావు హైదరితో విడాకులు తీసుకున్న ఈయన 2013 జనవరి 27న మీనా గుప్తా కూతురు ముసాబా గుప్త ని వివాహం చేసుకున్నారు. ముసాబా కి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ప్రస్తుతం సత్యదీప్ మిశ్రా పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.