Vidyullekha Raman : పెళ్ళిపీటలెక్కబోతున్న నటి విద్యుల్లేఖ రామన్!
Vidyullekha Raman : తమిళ నటి అయినప్పటికీ తనదైన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది నటి విద్యుల్లేఖ రామన్... రాజు గారి గది, మహర్షి,
Actress vidyullekha Raman gets engaged
Vidyullekha Raman : తమిళ నటి అయినప్పటికీ తనదైన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది నటి విద్యుల్లేఖ రామన్... రాజు గారి గది, మహర్షి, వెంకీ మామ మొదలైన చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి.. అయితే సినిమాల్లో ఎక్కువగా బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ తాజాగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా ఆమె జూన్ 20 నాటికి 68.2 కేజీలకి చేరుకుంది.
ఇక ఇది ఇలా ఉంటే అభిమానులకి శుభవార్తను వెల్లడించింది. త్వరలో తానూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా వెల్లడించింది. తనకి కాబోయే భర్త ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్‌తో ఆమె వివాహం జరగనుంది. తాజాగా ఆగస్టు 26 న రోకా ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు పేర్కొంది. కరోనా నిబంధనలకు లోబడి నిశ్చితార్థం చేసుకున్నట్లుగా వెల్లడించింది.
సైలెంట్‌గా నిశ్చితార్ధం చేసుకున్న విద్యుల్లేఖ తన కాబోయే భర్తతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విద్యుల్లేఖ తండ్రి ప్రముఖ తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం విద్యుల్లేఖ రామన్ ప్రస్తుతం తమిళ్ , తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.