Tabu: ఆ విషయం హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు.? టబు ఆసక్తికర వ్యాఖ్యలు
Tabu: ఆ విషయం హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు.? టబు ఆసక్తికర వ్యాఖ్యలు
Tabu: ఆ విషయం హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు.? టబు ఆసక్తికర వ్యాఖ్యలు
Tabu: సినిమా తారలకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆశ పడుతుంటారు. ముఖ్యంగా వారి రెమ్యునరేషన్ ఎంత అనే విషయం ఆసక్తి చూపిస్తుంటారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో కేవలం హీరోయిన్లే ఎందుకు ప్రశ్నిస్తారని అంటోది నటి టబు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టబు విషయంపై ఓ రకంగా కాస్త అసహనానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. టబు, అజయ్ దేవగణ్ జంటగా తెరకెక్కిన తాజాగా చిత్రం ‘ఔర్ మే కహా దమ్ థా’ నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన రెమ్యునరేషకి సంబంధించి టబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సినిమా కోసం మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ.. హీరోయినులను మాత్రామే ఎందుకు అడుగుతారు. నిర్మాతలను అడగవచ్చు కదా! అలాగే మీకు మాత్రమే ఎందుకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటూ హీరోలను కూడా అడగవచ్చు కదా? ఇలా మీరు అడిగితే ఇలాంటి విషయంలో ఎన్నో మార్పులు వస్తాయి అని టబు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే టబు తాజాగా క్రూ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సక్సెస్‌తో టబు లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.