Tabu: టబు అసలు అలా అనలేదు.. బోల్డ్ కామెంట్స్‌పై క్లారిటీ..!
Tabu: ఇదిగో తోక అంటే అదిగో పులి అనే పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది.
Tabu: టబు అసలు అలా అనలేదు.. బోల్డ్ కామెంట్స్‌పై క్లారిటీ..!
Tabu: ఇదిగో తోక అంటే అదిగో పులి అనే పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. నటీనటులకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వారు పలానా వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సీనియర్ నటి టబుకు సంబంధించిన ఇలాంటి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.
టబు ఓ ఇంటర్వ్యూలో మగవారు గురించి బోల్డ్ కామెంట్స్ చేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌కు చెందిన కొన్ని వెబ్‌సైట్స్ ఈ విషయాన్ని ప్రధానంగా పబ్లిష్ చేశాయి. తనకు పెళ్లిపై ఆసక్తి లేదని, బెడ్‌పై ఒక మగాడు మాత్రమే కావాలి అంటూ కామెంట్స్ చేసిందని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై టబు టీమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు టబు అలాంటి వ్యాఖ్యలు చేయనే లేదంటూ ఓ ప్రటకన విడుదల చేశారు.
ఈ విషయమై టబు కూడా నేరుగా స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు అస్సలు ఎప్పుడూ చేయలేదంటూ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే టబు యూనిట్ సైతం ఈ వార్తలపై స్పందించింది. ‘పలు వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ టబు పేరుతో కొన్ని అవమానకరమైన, అసభ్యకరమైన తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. ఆమె ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని మేం స్పష్టం చేయాలనుకుంటున్నాము.అభిమానులను తప్పుదారి పట్టించడం తీవ్రమైన ఉల్లంఘన. ఈ వెబ్‌సైట్‌లు తక్షణమే ఈ తప్పుడు ప్రకటనలను తొలగించాలి. ఇందుకు గానూ అధికారికంగా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అంటూ ప్రకటనలో విడుదల చేశారు.
ఇక కెరీర్ విషయానికొస్తే టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి ‘భూత్ బంగ్లా’ షూటింగ్‌లో బిజీగా ఉంది. అక్షయ్, టబుతో పాటు పరేష్ రావల్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత అక్షయ్‌కుమార్, టబు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇంతకుముందు వీరిద్దరూ ‘హేరా పేరి’లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.