Samantha: ఆ విషయంలో తగ్గేదేలే.. వైరల్‌ అవుతోన్న సమంత లేటెస్ట్‌ వీడియో..!

Samantha: సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార సమంత.

Update: 2025-01-17 09:48 GMT

Samantha: ఆ విషయంలో తగ్గేదేలే.. వైరల్‌ అవుతోన్న సమంత లేటెస్ట్‌ వీడియో..!

Samantha: సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార సమంత. వరుస సినిమాలతో, భారీ రెమ్యునరేషన్‌తో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అయితే వైవాహిక బంధంలో బ్రేకప్, ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధి బారిన పడడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంది సామ్‌. కానీ ఇప్పుడు ఆ సమస్యలను అన్నింటిని అధిగమించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ దూసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది సమంత.

పుష్ప1లో స్పెషల్‌ సాంగ్‌లో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ అందాల తార సిటాడెల్ వెబ్‌ సిరీస్‌ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీగా అయ్యేందుకు సిద్ధమవుతోంది. 2024లో కేవలం ఒక్క సినిమాలో మాత్రమే కనిపించిన సమంత ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఆరోగ్యం సపోర్ట్‌ చేయకపోయినా సిటాడెల్‌లో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి మెప్పించింది.

కాగా కొత్తేడాదిలో సమంత బౌన్స్‌ బ్యాక్‌ అవుతోంది. ఇందులో భాగంగానే జిమ్‌లో తెగ వర్కవుట్స్‌ చేస్తోంది. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. కొత్తేడాదిలో రిజల్యూషన్స్‌ తీసుకొని మర్చిపోతుంటామని కానీ అలా చేయకుండా తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాలని సామ్‌ చెప్పుకొచ్చింది. ఈ జర్నీలో తనతో భాగమవ్వండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సమంత పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత తెలుగుతోపాటు తమిళంలో కొన్ని సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వలోనే ఈ సినిమా షూటింగ్స్‌ మొదలు కానున్నాయి. ఆచతితూచి ప్రాజెక్ట్స్‌ను ఎంచుకుంటోంది. మరి సమంతకు పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో చూడాలి. 


Tags:    

Similar News