Samantha: చైతూ రెండో పెళ్లిపై తొలిసారి స్పందించిన సమంత.. షాకింగ్ కామెంట్స్‌..!

Samantha: ప్రేమ, వివాహం, విడాకాలు, ఆ తర్వాత అనారోగ్యం ఇలా సమంత జీవితంలో ఎన్నో మలుపులు.

Update: 2025-02-06 04:42 GMT

Samantha: చైతూ రెండో పెళ్లిపై తొలిసారి స్పందించిన సమంత.. షాకింగ్ కామెంట్స్‌..!

Samantha: ప్రేమ, వివాహం, విడాకాలు, ఆ తర్వాత అనారోగ్యం ఇలా సమంత జీవితంలో ఎన్నో మలుపులు. ఎన్నో కష్టాలు ఎదురైనా తనదైన శైలిలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది సమంత. కష్టాలన్నింటినీ ఎదుర్కొని మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆరోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సమంత మళ్లీ కెరీర్‌లో బిజీగా మారుతోంది. తాజాగా సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‌తో మంచి హిట్ అందుకుంది.

ఇక తన స్వంత నిర్మాణ సంస్థ ద్వారా 'మా ఇంటి బంగారం' అనే ప్రాజెక్ట్‌ను కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా సమంత పలు ప్రకటనల్లో నటిస్తూ బిజీగా మారుతోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య రెండో వివాహం గురించి సమంత ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం చై రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్‌ చేసింది. నాగచైతన్య, శోభితల వివాహానికి ఎదురైన ప్రశ్నకు ఆసక్తికరమైన రిప్లై ఇచ్చింది.

ఇంటర్వ్యూలో సమంతకు 'మీ మాజీ భర్త కొత్త జీవితాన్ని ప్రారంభించడం మీకు అసూయగా అనిపించలేదా?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమంత మాట్లాడుతూ.. "నా జీవితంలో అసూయకు ఎప్పుడూ తావుండదు. అసూయనే అన్ని చెడు పనులకు మూలం అవుతుందని నేను నమ్ముతాను. అందుకే, ఎవరి పట్లనూ నాకు అసూయ అనిపించదు. నా గత గాయాల నుంచి బయటపడటానికి చాలా శ్రమించాను"అని చెప్పుకొచ్చింది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. సమంత నిజంగా స్ట్రాంగ్‌ ఉమెన్‌ అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. 

Tags:    

Similar News