Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో ఇవాళ ఈడీ ముందుకు రకుల్‌ ప్రీత్‌

* మూడ్రోజుల ముందే విచారణకు అంటెడ్‌ అవుతున్న రకుల్‌ * డ్రగ్‌ మాఫీయాతో ఉన్న ఆధారాలను చూపి రకుల్‌కు ప్రశ్నలు..?

Update: 2021-09-03 03:53 GMT

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (ఫోటో : ది హన్స్ ఇండియా )

Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఆమె ఈనెల 6న ఇంటరాగేషన్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆరోజు తాను రాలేనంటూ రకుల్‌ ఈడీకి రిక్వెస్ట్‌ చేసుకున్నారు. కాగా డేట్‌ మార్చేందుకు మొదట అధికారులు ఒప్పుకోలేదు. దీంతో ముందుగా వచ్చేందుకు రెడీ అంటూ అధికారులకు మరో రిక్వెస్ట్‌ చేశారు రకుల్‌. ఇందుకు ఒప్పుకున్న ఈడీ ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఎంక్వైరీకి రమ్మంటూ రిప్లై ఇచ్చింది.

డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ విచారణ కీలకం అని పలువురు చెప్తున్నారు. ఎందుకంటే గతేడాది ఆమె ముంబైలోను విచారణ ఎదుర్కొన్నారు. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత డ్రగ్స్‌ వాడకంపై ముంబై నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో ఫోకస్‌ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

ఇదిలా ఉండగా డ్రగ్స్‌ కేసులో నిన్న హీరోయిన్‌ ఛార్మిని విచారించారు ఈడీ అధికారులు. దాదాపు ఎనిమిది గంటలకుపైగా ఛార్మిని ప్రశ్నించారు. ఇక విచారణ అనంతరం బయటకు వచ్చిన ఛార్మి ఈడీ డిపార్ట్‌మెంట్‌కి ‎డాక్యుమెంట్స్‌ ఇచ్చినట్లు చెప్పింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని వెల్లడించింది. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరించినట్లు చెప్పిన ఛార్మి ఇంతకు మించి తాను ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలేనని తెలిపింది.

ఇక డ్రగ్స్‌ కేసులో మొదటగా పూరీ జగన్నాథ్‌ను విచారించింది ఈడీ. ఇందులో భాగంగా పూరీ స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేశారు అధికారులు. పదిగంటలపాటు పూరీని విచారించిన ఈడీ అధికారులు మనీల్యాండరింగ్‌, ఫెమా నిబంధన ఉల్లంఘనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అటు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. డ్రగ్స్‌ కొనుగోళ్లు ఏరూపంలో జరిగాయన్న అంశాలపై వివరాలు సేకరించారు. ఇక పూరీ జగన్నాథ్‌ మూడు బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లను పరిశీలించిన ఈడీ వైష్ణో బ్యానర్‌, పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌ ఆడిట్‌ రిపోర్ట్‌లను పరిశీలించింది. మొత్తానికి గతంలో అరెస్ట్‌ అయిన నిందితుల స్టేట్‌మెంట్‌ ఆధారంగా పూరీని ప్రశ్నించారు ఈడీ అధికారులు.

Tags:    

Similar News