Pooja Hegde: 'ఇకపై ఆ తప్పు చేయను'... పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2024-10-29 06:49 GMT

Actress Pooja Hegde: 2014లో 'ఒక లైలా కోసం' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఆ తర్వాత అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. వరుసగా బడా సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది. దాదాపు అందరు స్టార్‌ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. అయితే గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ టైం బాగా లేదు.

పూజా నటించిన సినిమాల పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. 'అల వైకుంఠపురం' తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. హిందీపాటు దక్షిణాదిలోనూ ఆఫర్స్‌ రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే పూజా మళ్లీ బిజీ అవుతోంది. ఇప్పటికే సూర్య 44వ చిత్రంలో పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.

అలాగే దళపతి విజయ్‌ హీరోగా వస్తున్న 69వ చిత్రంలో కూడా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు బాలీవుడ్‌లోనూ వరుణ్‌ధావన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటున్న తరుణంలో పూజా హెగ్డే తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. కథల ఎంపిక విషయంలో గతంలో మాదిరిగా తప్పులు జరగకుండా చూసుకుంటానని, వచ్చే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది.

సినిమాల ఎంపిక విషయంలో మైండ్‌సెట్‌ను మార్చుకున్నాను అన్న పూజా.. కథల ఎంపికలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చింది. గత చిత్రాలన్నింటిని విశ్లేషించి ఎక్కడ తప్పులు జరిగాయో తెలుసుకుంటానని అంది. అలాగే వచ్చే ఏడాది మంచి విజయాల్ని అందిస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేసింది.

Tags:    

Similar News