Janhvi Kapoor: ఆ పాత్ర‌లో అస్స‌లు న‌టించ‌ను.. జాన్వీక‌పూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Janhvi Kapoor: ఆ పాత్ర‌లో అస్స‌లు న‌టించ‌ను.. జాన్వీక‌పూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Update: 2024-08-03 14:00 GMT

Janhvi Kapoor: ఆ పాత్ర‌లో అస్స‌లు న‌టించ‌ను.. జాన్వీక‌పూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

Janhvi Kapoor: అల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి శ్రీదేవీ న‌ట వార‌త్వం అండ‌గా ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకంగా గుర్తింపును సంపాదించుకుంది అందాల తార జాన్వీక‌పూర్‌. పేరుకు న‌ట వార‌సత్వం ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా మొద‌టి సినిమాలో న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లో న‌టించి మెప్పించిందీ చిన్న‌ది. ఆ త‌ర్వాత కూడా ఎక్కువ‌గా ఛాలెజింగ్ రోల్స్‌లోనే న‌టిస్తూ మెప్పిస్తోంది.

జాన్వీ ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన దాదాపు అన్ని చిత్రాల్లో న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్ర‌స్తుతం ఉగల‌ఘ్ అనే చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న జాన్వీ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. పాత్రలపరంగా తాను విధించుకున్న పరిమితుల గురించి ఓ విష‌యాన్ని చెప్పుకొచ్చింది.

ఈ సంద‌ర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. తాను ఛాలెంజింగ్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాన‌ని చెప్పుకొచ్చింది. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లో జుట్టు లేకుండా మాత్రం న‌టించ‌న‌ని తేల్చి చెప్పింది. అలాంటి పాత్ర‌లో న‌టించ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డ‌ని జాన్వీ క‌పూర్ తెలిపింది. ‘ఉలఝ్‌’ సినిమాలో పాత్రపరంగా కొంత జుట్టు కట్‌ చేసుకోవాలని దర్శకుడు కోరితే సున్నితంగా తిరస్కరించాని చెప్పుకొచ్చింది.

ఇక త‌న తొలి చిత్రం ధ‌డ‌క్‌లో జుట్టు క‌త్తిరించుకునే స‌న్నివేశం ఉంటుంది. ఆ స‌మ‌యంలో త‌ల్లి శ్రీదేవీ త‌న‌పై కోప్ప‌డిన విష‌యాన్ని జాన్వీ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. ఎలాంటి పాత్ర చేసినా సరే, జుట్టు మాత్రం కట్‌ చేసుకోవద్దని శ్రీవ‌దేవీ స‌ల‌హా ఇచ్చిన విష‌యాన్ని జాన్వీ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘అమ్మకు నా జట్టు అంటే చాలా ఇష్టం. వారానికి రెండుసార్లు ఆయిల్‌ రాసి జుట్టు గురించి ఎన్నో జాగ్ర‌త్త‌లు చెప్పేది. అమ్మ మీద ఇష్టంతో హెయిర్‌ కట్‌ చేసుకోవద్దని నిర్ణయించుకున్నా’ అని చెప్పుకొచ్చిందీ చిన్న‌ది.

Tags:    

Similar News