Janhvi Kapoor: సినిమాలకు గుడ్ బై చెబుతా... వైరల్‌గా మారిన జాన్వీ కామెంట్స్..!
Janhvi Kapoor: జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జాన్వీ.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జాన్వీ. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జాన్వీకపూర్‌కు తిరుపతి అంటే ఇష్టమనే విషయం చాలాసార్లు చెప్పారు. ఇప్పటికే తిరుపతిని పలుసార్లు దర్శించుకున్నారు. అంతేకాదు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికను కూడా తెలిపారు. రీసెంట్‌గా కరణ్ జొహర్ షోలో మాట్లాడిన జాన్వీ.. పెళ్లి చేసుకుని తిరుమలలో భర్తతో సెటిల్ అవ్వాలని.. ముగ్గురు పిల్లలతో హాయిగా గడపాలని.. ప్రతిరోజు అరటి ఆకులో అన్నం తినాలి, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలి అని తెలిపింది. అంతేకాదు పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి అందర్నీ మెప్పించారు. ఇక ఇప్పుడు అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు జాన్వీ. ఇప్పుడు దేవర2, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ హీరోయిగా నటిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది.