Jamuna: మహాప్రస్థానంలో ముగిసిన సీనియర్‌ నటి జమున అంత్యక్రియలు

Jamuna: అంతిమ సంస్కారాలు నిర్వహించిన కూతురు స్రవంతిరావు

Update: 2023-01-27 14:38 GMT

Jamuna: మహాప్రస్థానంలో ముగిసిన సీనియర్‌ నటి జమున అంత్యక్రియలు

Jamuna: సీనియర్‌ నటి జమున అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. విదేశాల్లో ఉన్న కుమారుడు రావడం ఆలస్యం కావడంతో కూతురు స్రవంతిరావు తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భౌతికకాయం వద్ద నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జమునతో తమకున్న అనుభవాలు, అనుభూతులను నెమరువేసుకున్నారు. 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించిన జమున 1953లో పుట్టిల్లు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. సత్యభామ పాత్ర ఆమెకు ఎంతగానో గుర్తింపును తీసుకువచ్చింది. మిస్సమ్మ సినిమా జమున కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. సంతోషం, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, భూ కైలాస్‌, భాగ్యరేఖ, గుండమ్మకథతో పాటు పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. 2008లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డును అందుకున్నారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు జమునను వరించాయి.

Tags:    

Similar News