Ameesha Patel : అమీషా పటేల్ దగ్గర 400 లగ్జరీ బ్యాగ్‌లు.. వాటిని అమ్మితే ముంబైలో ఇల్లు కొనొచ్చట
Ameesha Patel : అమీషా పటేల్ దగ్గర 400 లగ్జరీ బ్యాగ్‌లు.. వాటిని అమ్మితే ముంబైలో ఇల్లు కొనొచ్చట
Ameesha Patel : అమీషా పటేల్ దగ్గర 400 లగ్జరీ బ్యాగ్‌లు.. వాటిని అమ్మితే ముంబైలో ఇల్లు కొనొచ్చట
Ameesha Patel : అమీషా పటేల్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఈ హీరోయిన్ గురించి ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. అమీషా పటేల్‌కు అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు సేకరించడం ఒక హాబీ. ఆమె దగ్గర 400కు పైగా లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు ఉన్నాయి. వాటి మొత్తం విలువ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ బ్యాగులను అమ్మితే ముంబైలో ఒక లగ్జరీ ఇల్లు లేదా పెంట్‌హౌస్ కొనేంత డబ్బు వస్తుందని స్వయంగా అమీషానే చెప్పారు.
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తన యూట్యూబ్ ఛానెల్ కోసం అమీషా పటేల్ ఇంటికి వెళ్లారు. అక్కడ అమీషా లగ్జరీ వస్తువుల కలెక్షన్ చూసి ఫరా ఖాన్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అమీషా దగ్గర ఉన్న హ్యాండ్‌బ్యాగుల కలెక్షన్ చూసి ఫరా నోరెళ్లబెట్టారు. ప్రతిసారి అమీషా ఒక కొత్త బ్యాగ్ వేసుకుని వస్తుంటారని ఫరా తన వీడియోలో చెప్పారు. దానికి అమీషా స్పందిస్తూ, తన దగ్గర 300 నుంచి 400 లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు ఉన్నాయని తెలిపారు. అమీషా దగ్గర హ్యాండ్‌బ్యాగులే కాకుండా, ఖరీదైన బెల్టులు, వాచీలు, షూలు కూడా ఉన్నాయని ఫరా తెలిపారు.
https://www.youtube.com/watch?v=jhqbhb1k7iw
అమీషా పటేల్ దగ్గర ఉన్న బ్యాగుల మొత్తం విలువ రూ. 2 నుంచి 3 కోట్లు వరకు ఉంటుందని అంచనా. "బహుశా సినీ పరిశ్రమలో నా దగ్గర ఉన్నన్ని డిజైనర్ బ్యాగులు మరెవరి దగ్గర ఉండకపోవచ్చు" అని అమీషా అన్నారు. "ఈ బ్యాగులు కొనకుండా ఆ డబ్బు దాచుకుని ఉంటే, ముంబైలో మరో పెంట్‌హౌస్ కొనేదానిని" అని కూడా అమీషా సరదాగా చెప్పారు.
అమీషా దగ్గర ఉన్న చాలా బ్యాగులు లిమిటెడ్ ఎడిషన్ బ్యాగులు కావడం విశేషం. ప్రపంచంలో చాలా తక్కువమంది దగ్గర మాత్రమే ఇలాంటి బ్యాగులు ఉన్నాయని అమీషా చెప్పారు. ఈ సందర్భంగా, అమీషా ఒక లేత గులాబీ రంగు బ్యాగ్‌ను ఫరాకు చూపించారు. దాని రంగు క్రమంగా నలుపు రంగులోకి మారుతుందని, అది మొసలి చర్మంతో తయారు చేయబడిందని అమీషా తెలిపారు. అమీషా పటేల్ ప్రస్తుతం సినిమాలలో అంతగా యాక్టివ్‌గా లేనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటారు. అమీషా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు.