Abhinaya: అత్యాచార సీన్‌పై స్పందించిన అభినయ.. ఏమన్నారంటే..

Update: 2025-01-19 14:15 GMT

అత్యాచార సీన్‌పై స్పందించిన అభినయ.. ఏమన్నారంటే..

Actress Abhinaya about pani movie: మలయాళ చిత్రం 'పని' ప్రస్తుతం ఓటీటీలో తెగ ట్రెండ్‌ అవుతోన్న విషయం తెలిసిందే. జోజూ జార్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అభినయ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్‌పై చిత్రీకరించిన రేప్‌ సీన్స్‌ రచ్చకు దారి తీశాయి. ఈ సన్నివేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

అయితే తాజాగా ఈ సన్నివేశాలపై అభినయ స్పందించింది. సైన్‌ లాంగ్వేజ్‌తో తన అభిప్రాయాన్ని తెలియ చేశారు అభినయ. ఈ విషయమై ఆమె స్పందిస్తూ.. 'తన సినిమాలో ఎలాంటి సన్నివేశాలు పెట్టాలి? ఎలా తెరకెక్కించాలి? అనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయం. కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. ఏది ఏమైనా దర్శకుడి మాటే తుది నిర్ణయం. జోజూ గొప్ప నటుడు. ఎన్నో భాషల్లో, ఎంతోమంది పేరు పొందిన దర్శకులతో వర్క్‌ చేసిన అనుభవం ఆయన సొంతం' అని చెప్పుకొచ్చారు.

'మిగిలిన భాషలతో పోలిస్తే మలయాళంలో యాక్ట్‌ చేయడం కాస్త భిన్నమైన అనుభూతిని అందించింది. సినిమా షూటింగ్‌ సమయంలో జోజూ నాకు ఎంతో సాయం చేశారు. యాక్టింగ్‌ గురించి ఆయన సలహాలు ఇచ్చేవారు. ఆయనతో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. మలయాళ నటుడు టొవినో థామస్‌ నటన నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది' అని అభినయ చెప్పుకొచ్చింది.

రాజమౌళి అంటే తనకు అభిమానం అని అభినయ అంటోంది. ఆయన సినిమాలో ఒక్కసారైనా నటించాలని అనుకుంటున్నానని తన మనసులో మాటను బయటపెట్టింది. తాను ఈ స్థాయికి చేరడానికి కుటుంబ సభ్యులే కారణమని అన్నారు. తన కలను కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారని.. కథ ఎంపిక, చిత్రీకరణ ఇలా అన్ని విషయాల్లో అండగా నిలిచారని అభినయ అభిప్రాయపడింది. 

Tags:    

Similar News