మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్!
Sonu Sood Installs Mobile Tower : దేశంలో లాక్ డౌన్ మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు సహాయం చేసుకుంటూనే వస్తున్నాడు నటుడు సోనూసూద్ ..
Sonu Sood installs mobile Tower for Students
Sonu Sood Installs Mobile Tower : దేశంలో లాక్ డౌన్ మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు సహాయం చేసుకుంటూనే వస్తున్నాడు నటుడు సోనూసూద్ .. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. అంతకన్నా ఇంకా ఎక్కువ సహాయలు చేస్తూనే ఉన్నాడు. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. చిన్న పిల్లలకు ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు దానికి సొల్యూషన్ లాగా మారిపోతున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది.
తాజాగా మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు సోనూసూద్.. పేద విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని అవసరమైన సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. హర్యానాలోని మొర్ని గ్రామానికి మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో ఓ విద్యార్థి ఆన్ లైన్ క్లాసెస్ కోసం చెట్టెక్కి పాఠాలు వింటున్నాడు. అయితే చెట్టెక్కితే కానీ నెట్‌వర్క్ రాని పరిస్థితి అక్కడ నెలకొంది.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న సోనూసూద్ చలించిపోయాడు.. ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఎయిర్‌టెల్ టవర్‌ను ఏర్పాటు చేయించి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. సోనూసూద్ చేసిన ఈ పనికి ఆ గ్రామ పెద్దలు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.