రియల్ హీరో : అడవిలో మంటలు అర్పిన సాయాజీ షిండే

ప్రకృతిపై సినిమాలలో డైలాగ్స్ చెప్పే నటులే ఎక్కువ కానీ నిజజీవితంలో పర్యావరణంపై మక్కువ చూపించే నటులు చాలా తక్కువే అని చెప్పాలి.

Update: 2020-03-09 13:17 GMT
sayaji shinde

ప్రకృతిపై సినిమాలలో డైలాగ్స్ చెప్పే నటులే ఎక్కువ కానీ నిజజీవితంలో పర్యావరణంపై మక్కువ చూపించే నటులు చాలా తక్కువే అని చెప్పాలి. అతితక్కువ మందిలో టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఒకరు.. ఆదివారం మహారాష్ట్రలోని పుణే శివార్లలో ఉన్న కాట్‌రాజ్ ఘాట్ రోడ్డులో మంటలు చెలరేగాయి.ఇది కారులో వెళ్తుండగా చూసిన సాయాజీ షిండే వెంటనే కారు ఆపి కిందికి దిగి మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఆయనకి తోడుగా మరికొందరు సహాయం చేయడంతో భారీ నష్టం జరగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో నెటిజన్లు సాయాజీ షిండేపై రియల్ హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సాయాజీ షిండే విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. స్వతహాగా మరాఠి నటుడు అయినప్పటికీ ఏ భాషలో నటిస్తే ఆ భాషలో డబ్బింగ్ చెప్పుకోవడం సాయాజీ షిండే ప్రత్యేకతగా చెప్పుకోవాలి.. ఠాగూర్, పోకిరి, అరుంధతి చిత్రాలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి.. ఇప్పటి వరకు తెలుగులో అయన 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ, మరాఠి, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఆర్టిస్టుగా ఉన్నారు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. 


Tags:    

Similar News