Ajay Devagan
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కలు నాటాడు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. దండు మల్కాపూర్ నుంచి పురోహితులతో, డోలు కళాకారులతో పార్క్ అధికారులు, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అజయ్ దేవగన్‌కు ఘనస్వాగతం పలికారు.