Neelambari Song Promo: మణిశర్మ మ్యూజిక్.., చరణ్ డాన్స్ తో "నీలాంబరి" అదుర్స్
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఆచార్య"
Neelambari Song Promo: మణిశర్మ మ్యూజిక్.., చరణ్ డాన్స్ తో "నీలాంబరి" అదుర్స్
Neelambari Song Promo: ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "ఆచార్య". ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి గాను మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా "ఆచార్య" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు జంటగా "నీలాంబరి" పాత్రలో పూజా హెగ్డే నటిస్తుంది. ఇదిలా ఉండగా ఈ ఇద్దరి మధ్య "నీలాంబరి" మెలోడీ సాంగ్ ప్రోమోని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు.
సంగీత దర్శకుడు మణిశర్మ తన మ్యూజిక్ లో ఏదో మ్యాజిక్ ఉందని ఈ మెలోడీ సాంగ్ ప్రోమో వింటేనే అర్ధమవుతుంది. మంచి మెలోడీ సాంగ్ కి రామ్ చరణ్ వేసిన స్టెప్స్ మెగా అభిమానులను మరింత ఆకట్టుకోనున్నాయి. ఇక "నీలాంబరి" ఫుల్ సాంగ్ ని నవంబర్ 5న ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నారు. మ్యాట్నీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.