Koratala Siva: సోషల్ మీడియాకు దూరంగా కొరటాల శివ ఎందుకో తెలుసా?
Koratala Siva: తన మనసులోని మాటని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు కొరటాల శివ.
Acharya Director Koratala Siva
Koratala Siva: తాను సోషల్ మీడియాకి దూరమవుతున్నట్టు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. చివరిగా తన మనసులోని మాటని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'ఇప్పటి వరకు ఎన్నో విషయాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా మీతో పంచుకున్నాను. వాటి నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైంది.మన మీడియా మిత్రుల ద్వారా మీతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను.
మాధ్యమం మారుతుంది కానీ మన అనుబంధం కాదు' అని పేర్కొన్నారు. తన సినిమాలకి సంబంధించిన విషయాల్నే కాకుండా సామాజిక అంశాలపైనా ట్విటర్‌లో చర్చించేవారు కొరటాల. ప్రస్తుతం ఆయన చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' తెరకెక్కిస్తున్నారు. కాజల్ నాయిక. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది పూర్తయ్యాక ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేయనున్నారు.