Naga Shaurya Farm House Case: ఎవరీ గుత్తా సుమన్
* సెటిల్‌మెంట్లు, బెదిరింపుల్లో ఆరితేరిన సుమన్ * పలుచోట్ల భూ వ్యవహారాల మోసాలు * తాండూరులో 55 ఎకరాల మోసం
అసలు ఎవరీ గుత్తా సుమన్(ఫైల్ ఫోటో)
Naga Shaurya Farm House Case: నటుడు నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో దొరికిన గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఫామ్‌హౌస్‌లను అద్దెకు తీసుకొని గుత్తా సుమన్ పేకాట ఆడిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల క్యాసినో ఆడిపిస్తున్నట్టు సమాచారం సేకరించారు.
అసలు ఎవరీ గుత్తా సుమన్ అని చూస్తే సెటిల్‌మెంట్లు, బెదిరింపుల్లో ఆరితేరిన వ్యక్తి గుత్తా సుమన్. పలుచోట్ల భూ వ్యవహారాల్లో మోసాలకు పాల్పడ్డాడు సుమన్. తాండూరులో 55 ఎకరాలు మోసం చేసిన బాధితుల్లో ఓ డాక్టర్, పోలీస్ అధికారి కూడా ఉన్నారు. అలాగే గుంటూరులోనూ గుత్తా సుమన్‌పై పలు కేసులు ఉన్నాయి. అమెరికాలో ఉన్న పలువురు ఎన్నారైలను సుమన్ మోసం చేశారు.