Prabhas-Trisha: వెండితెరపై మరోసారి సందడి చేయనున్న క్యూట్ కపుల్.. 16 ఏళ్ల తర్వాత ..
Prabhas-Trisha: ప్రభాస్, త్రిష.. వెండి తెరపై ఈ క్యూట్ కపుల్ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Prabhas-Trisha: వెండితెరపై మరోసారి సందడి చేయనున్న క్యూట్ కపుల్.. 16 ఏళ్ల తర్వాత ..
Prabhas-Trisha: ప్రభాస్, త్రిష.. వెండి తెరపై ఈ క్యూట్ కపుల్ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు ఇలా ఈ సినిమాల్లో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌తో ఈ జంట ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ప్రభాస్ హైట్‌కు తగ్గ అతికొద్ది మంది హీరోయిన్లలో త్రిష ఒకరు, అందుకే ఈ జంటకు ఫ్యాన్స్ ఫుల్ మార్క్స్ వేశారు. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చి దాదాపు 16 ఏళ్లు గడుస్తోంది. అయితే తాజాగా ఈ జంట మరోసారి వెండి తెరపై సందడి చేయనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్‌తో పాటు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, హను రాఘవపూడి దర్శకత్వంతో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉండగా త్వలోనే సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉంటే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా త్రిష నటించనుందని తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ విషయమై త్రిషను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్రిష సైతం ఇటీవల మళ్లీ వరుస విజయాలతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బృంద వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్‌లో నటించిన త్రిష తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.