Dacoit: ఊహించని ట్విస్ట్.. డెకాయిట్ నుంచి తప్పుకున్న శృతీహాసన్, కారణం ఇదేనా?
Dacoit: అడివిశేష్ హీరోగా షనీల్ డియో దర్శకత్వంలో 'డెకాయిట్' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
Dacoit: ఊహించని ట్విస్ట్.. డెకాయిట్ నుంచి తప్పుకున్న శృతీహాసన్, కారణం ఇదేనా?
Dacoit: అడివిశేష్ హీరోగా షనీల్ డియో దర్శకత్వంలో 'డెకాయిట్' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ సినిమాలో అడివిశేష్‌కు జోడిగా శృతిహాసన్ నటిస్తున్నట్లు కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డెకాయిట్ మూవీ నుంచి శృతీహాసన్ తప్పుకుంది అనేది సదరు వార్త సారాంశం. ఇందుకు కారణం ఇదేనంటూ ఓ వార్త ట్రెండ్ అవుతోంది. తన పాత్రకు సంబంధించి, ప్రొడక్షన్ హౌస్‌తో నెలకొన్న సమస్యల నేపథ్యంలో శృతిహాసన్ సినిమా నుంచి తప్పుకుందని టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ మరో హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరో పాపులర్ హీరోయిన్‌ను ఇందు కోసం ఓకే చేసే పనిలో ఉన్నారని ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. వచ్చే వారమే ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌ను మళ్లీ రీ షూట్ చేయక తప్పదన్నమాట.