Naga Chaitanya: నాగచైతన్య, శోభిత పెళ్లి ఎక్కడో తెలుసా.? ఆ దేశంలో ప్లాన్ చేస్తున్న..
ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ వైభవంగా జరిపారు. నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
naga chaitanya and sobhita dhulipala
అక్కినేని హీరో నాగచైతన్య పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. 2021లో సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. నటి శోభితతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న చై ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ వైభవంగా జరిపారు. నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట వివాహానికి మాత్రం సమయం ఉంటుందని నాగార్జున ప్రకటించారు. పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ జంట పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ జంట వివాహం భారత్‌లో కాకుండా విదేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పారిస్‌లో ఈ జంట వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిత సభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక వివాహం తర్వాత మళ్లీ భారత్‌లో రిసిప్షన్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 2023లో వచ్చిన కస్టడీ తర్వాత నాగ చైతన్య మరో చిత్రం రాలేదు. అయితే ఆ తర్వాత దూత అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అక్కటున్న చై ప్రస్తుతం తడేల్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నాగ చైతన్య వివాహ తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.