Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ అప్‌డేట్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచేనా..?
Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Saripodhaa Sanivaaram OTT
Saripodhaa Sanivaaram OTT Release Date: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందీ మూవీ. విడుదలైన అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోయింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఈ సినిమాపై వసూళ్లపై ప్రభావం పడినట్లు స్పష్టమవుతోంది.
అయితే సినిమా మాత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాని నటనకు, దర్శకుడి మేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. నాని, ఎస్‌జే సూర్యల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో నాని ఖాతాలో మరో హిట్ పడింది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రియాంక మోహన్ సైతం మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
సరిపోదా శనివారం ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తల ప్రకారం ఈ సినిమా రెండు ఓటీటీల్లో విడుదల కానుందని సమచారం. సరిపోదా శనివారం సౌత్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నార్త్‌కు సంబంధించిన హక్కులను జియో సినిమా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రటకన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సరిపోద శనివారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారం. ఈ సినిమా సెప్టెంబర్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకే రెండు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన నెల రోజుల్లోపే ఓటీటీ సందడి చేయనున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.