అభిషేక్ బచ్చన్ ఆస్తుల కంటే ఐశ్వర్య ఆస్తులే ఎక్కువ.. ఎంతో తెలుసా?
Abhishek Bachchan's Net worth: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ హీరోగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయినా.. వ్యాపారంలో మాత్రం సత్తా చాటారు. అలా కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఫిబ్రవరి 5న అభిషేక్ బచ్చన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఒక్క ఛాన్స్ అంటూ అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే వాళ్లు చాలామందే ఉంటారు. అయితే సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారికి ఫస్ట్ ఛాన్స్ ఈజీగానే వస్తుంది. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే వాళ్లనూ ఎవరూ పట్టించుకోరు. అలా వారసత్వంగా వచ్చి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక కెరీర్ ఫేడౌట్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు.
అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ అంత స్టార్‌డమ్ సంపాదించుకోకపోయినా.. వ్యాపారవేత్తగా విజయం సాధించారు. అలా ఆస్తులను కూడబెట్టుకున్నారు. అభిషేక్ ఆస్తుల విషయానికొస్తే.. ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ.280 కోట్లకు పైనే ఉంటుంది. తండ్రి నుండి వారసత్వంగా వచ్చే ఆస్తులు కలిపితే ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. తన డబ్బులో ఎక్కువ భాగం ముంబైలోని బాంద్రా ప్రాంతంలో పెట్టుబడి పెట్టారంట అభిషేక్. అలాగే దుబాయ్‌లో రూ.16 కోట్లు పెట్టి ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు.
బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, 5 BHK అపార్ట్‌మెంట్‌తో సహా అనేక ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. అభిషేక్ బచ్చన్‌కు క్రీడలంటే ఆసక్తి ఎక్కువ. అందుకే జైపూర్ పింక్ పాంతర్స్ (ప్రో కబడ్డీ), చెన్నైయిన్ FC (ఫుట్‌బాల్) వంటి స్పోర్ట్స్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. తండ్రితో కలిసి అనేక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్ విషయానికొస్తే... ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.776 కోట్ల వరకు ఉంటుంది. ఐశ్వర్య రాయ్ ఆస్తులతో పోలిస్తే అభిషేక్ ఆస్తుల విలువ చాలా తక్కువే.
అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అభిషేక్ నటించిన సినిమాల్లో ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అభిషేక్ నటించిన రెఫ్యూజీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. నటన పరంగా మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అభిషేక్ నటించిన 8 సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. అయినా అభిషేక్‌కు ఛాన్సులు వచ్చాయి. ధూమ్ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అభిషేక్. బంటీ ఔర్ బబ్లీ మూవీతో సోలో హీరోగా హిట్ కొట్టాడు. ధూమ్3, హ్యాపీ న్యూ ఇయర్, ఐ వాంట్ టు టాక్ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం అభిషేక్ గులాబ్ జామున్, డ్యాన్సింగ్ డాడ్‌తో పాటు ధూమ్ 4 చిత్రాల్లో నటిస్తున్నారు.