50 శాతం కూడా సినిమా పూర్తవ్వకుండానే ఓటీటీల గురించి చెబుతున్న నిర్మాతలు

*ఓటీటీల గురించి చెబుతూనే థియేటర్లకి రమ్మంటున్న నిర్మాతలు

Update: 2023-01-16 09:22 GMT

50 శాతం కూడా సినిమా పూర్తవ్వకుండానే ఓటీటీల గురించి చెబుతున్న నిర్మాతలు

OTT: ఈమధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఎన్నో కొన్ని రోజుల తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రత్యక్షమవుతుంది. అయితే కొన్ని నెలల క్రితం తెలుగు సినిమా నిర్మాతలు అందరూ కలిసి ఒక మాట అనుకున్నారు. తమ సినిమాలు విడుదల అయ్యే ముందు కానీ విడుదల అయ్యాక కానీ పబ్లిసిటీ కోసం సినిమా ఏ ఓటీటీ లో విడుదలవుతుంది అనే విషయాన్ని చెప్పకూడదు అని అనుకున్నారు. ముందు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడాలని అప్పటిదాకా ఓటీటీ గురించి ఎత్తకూడదని వారి ఉద్దేశం.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విడుదలకి ముందే నిర్మాతలు సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందో కూడా చాలా గొప్పగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. చిరంజీవి "భోళాశంకర్" డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారు. సినిమా షూటింగ్ ఇంకా 30 నుంచి 40% మాత్రమే పూర్తయింది. కానీ అప్పుడే సినిమా డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి. మరోవైపు అనుష్క మరియు నవీన్ పోలిశెట్టిల సినిమా కూడా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు లేవు కానీ చిత్ర డిజిటల్ రైస్ ని కూడా నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసేసుకున్నారు.

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న "విరూపాక్ష", కల్యాణ్ రామ్ "అమిగోస్" ఆఖరికి సిద్దు జొన్నలగడ్డ డిజే టిల్లు సీక్వెల్ "టిల్లు స్క్వేర్" సినిమా డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి. అయితే ఇలాంటి అనౌన్స్మెంట్ లు వస్తూ ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపించటం మానేశారు అని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా నిర్మాతలు సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పటం ఆపుతారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News