Tamannaah: 20 ఏళ్ల సినీ కెరీర్.. రూ.120 కోట్ల ఆస్తి.. ఆ హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. వరుస విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా నిలిచారు.

Update: 2025-02-15 09:24 GMT

20 ఏళ్ల సినీ కెరీర్.. రూ.120 కోట్ల ఆస్తి.. ఆ హీరోయిన్ ఎవరంటే..?

Tamannaah: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. వరుస విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా నిలిచారు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉంటూ.. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు తమన్నా భాటియా.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే చాలా కష్టం. కానీ ఇలా ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి మంచి ఫేమ్ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అందులో తమన్నా ఒకరు. హీరోయిన్‌గా దాదాపు 20 ఏళ్లు పూర్తి కావొస్తున్న ఇప్పటికే అదే గ్లామర్‌తో ఆడియన్స్‌‌ను మెప్పిస్తున్నారు. నార్త్ హీరోయిన్ అయినా.. సౌత్ కథానాయికగా దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. కెరీర్ బిగినింగ్‌లోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నారు.

తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు నటించిన శ్రీ అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాతో మంచి బ్రేక్ లభించింది. రెడీ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్‌ గంగతో రాంబాబు.. ఇలా వరుస సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు.

తమన్నా ప్రజంట్ హీరోయిన్‌గా నటిస్తూనే స్పెషల్ సాంగ్‌లను చేస్తున్నారు. అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, కేజీఎఫ్, జైలర్, స్త్రీ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టారు. తన డ్యాన్స్‌తో పాటు అందాలతోనూ కవ్విస్తున్నారు. ప్రస్తుతం తమన్నా ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు టాక్. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.120 కోట్ల. అలాగే ఆమె సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్‌లో నటిస్తూ ఎక్కువగా సంపాదిస్తున్నారని సమాచారం.

Tags:    

Similar News