Anirudh : సినిమాకు రూ.10కోట్లు తీసుకుంటాడు.. పాటల కోసం చాట్ జీపీటీ వాడుతాడట..ఏంటిది అనిరుధ్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ పేరు మార్మోగిపోతుంది. టాప్ స్టార్లందరూ అతడే తమ సినిమాలకు మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు తీసుకునే ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. పాటల కోసం చాట్‌జీపీటీ వాడుతున్నాడట.

Update: 2025-08-03 05:45 GMT

Anirudh : సినిమాకు రూ.10కోట్లు తీసుకుంటాడు.. పాటల కోసం చాట్ జీపీటీ వాడుతాడట..ఏంటిది అనిరుధ్

Anirudh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ పేరు మార్మోగిపోతుంది. టాప్ స్టార్లందరూ అతడే తమ సినిమాలకు మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు తీసుకునే ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. పాటల కోసం చాట్‌జీపీటీ వాడుతున్నాడట. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాకు మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ రవిచందర్ తన మ్యూజిక్ కంపోజింగ్ విధానం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కూలీ సినిమా పాటల గురించి మాట్లాడుతూ.. తాను చాట్‌జీపీటీని వాడానని నిజాయితీగా అంగీకరించారు. "నేను ఒక పాట రాస్తున్నాను. రెండు లైన్లు రాసిన తర్వాత ఆగిపోయాను. అప్పుడు చాట్‌జీపీటీని ఓపెన్ చేసి తర్వాతి రెండు లైన్లకు కొన్ని ఐడియాలు ఇవ్వు' అని అడిగాను. ఇది నిజం. కేవలం రెండు రోజుల క్రితమే ఇది జరిగింది. నేను చాట్‌జీపీటీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాను" అని అనిరుధ్ వివరించారు.

అనిరుధ్ మాట్లాడుతూ.. "చాట్‌జీపీటీ నాకు 10 కొత్త ఐడియాలు ఇచ్చింది. వాటిలో ఒకటి నాకు బాగా నచ్చింది. దాన్ని ఎంచుకుని పాటను పూర్తి చేశాను" అని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. "రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని ఇలా చాట్‌జీపీటీతో పనులు చేయిస్తావా?" అంటూ కామెంట్స్ చేశారు. అయితే చాలామంది అభిమానులు మాత్రం అనిరుధ్ నిజాయితీని మెచ్చుకున్నారు. క్రియేటివిటీ రంగంలో ఏఐని ఉపయోగించడంలో తప్పేమీ లేదని కొందరు సమర్థించారు.

అనిరుధ్ ఏ పాట కోసం ఏఐని ఉపయోగించాడో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ వినియోగం పెరిగిపోయింది. పూర్తిగా ఏఐతోనే సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. సంగీతం, సాహిత్యం వంటి క్రియేటివిటీ పనులకు కూడా ఏఐ సహాయం తీసుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. సమయాన్ని ఆదా చేసుకోవడానికి, కొత్త ఆలోచనలు పొందడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. అనిరుధ్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏఐని వాడుతున్నాడంటే, ఈ టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News