Revu Review: ఆద్యంతం ఆకట్టుకునేలా రేవు చిత్రం.. ప్లస్ పాయింట్స్ ఇవే..
ప్రస్తుతం చిన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. మంచి కథతో కూడుకున్న చిత్రాలకు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఓ చిన్న సినిమా అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Revu Review: ఆద్యంతం ఆకట్టుకునేలా రేవు చిత్రం.. ప్లస్ పాయింట్స్ ఇవే..
నటీనటులు: వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్ధవ్, అజయ్ నిడదవోలు, సుమేష్ మాధవన్ తదితరులు
ఎడిటింగ్: శివ శర్వానీ
సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్
సంగీతం: జాన్ కే జోసెఫ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పర్వతనేని రాంబాబు
నిర్మాత: మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి
దర్శకత్వం: హరినాథ్ పులి
ప్రస్తుతం చిన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. మంచి కథతో కూడుకున్న చిత్రాలకు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఓ చిన్న సినిమా అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన రేవు చిత్రం ఆగస్టు 23వ తేదీ విడుదలైంది. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవితాల్లో జరిగే సంఘటనలు, వారికి ఎదురైన కష్టాలు, అడ్డంకులను తమ స్థైర్యంతో ఎలా అధిగమించారు అనేదే ఈ సినిమా కథ. రేవు సముద్రతీర గ్రామమైన పాలరేవులో అంకాలు (వంశీ రామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారుల మధ్య పోటీ నేపథ్యంలో ఉంటుంది. ఈ సమయంలోనే ధనవంతుడు అయితన నాగేసు (యేపూరి హరి) రాకతో వారి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. సినిమా బలాల్లో నటీనటుల అద్భుత ప్రదర్శన ఒకటని చెప్పాలి. తమ అద్భుత నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా వంశీ రామ్ పెండ్యాల మత్స్యకారుడి పాత్రలో ఒదిగిపోయారు. ఎమోషన్స్‌ను చక్కగా పలికించారు.
అజయ్ అద్భుత నటన యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వంశీ రామ్ పెండ్యాల, అజయ్‌ల మధ్య వచ్చిన సంఘటనలు ఆకట్టుకున్నాయి. స్వాతి భీమి రెడ్డి అద్భుతంగా నటించగా, ఏపూరి హరి ప్రతినాయకుడిగా మెప్పించారు. రేవు చిత్రం మత్స్యకారుల జీవితాల్లోని సంఘటనలను, వారు ఎదుర్కొనే ఇబ్బందులను స్పష్టంగా తెలియజేశాయి. రచయిత, దర్శకుడు హరినాథ్ పులి కథను తెలిపిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ పార్ట్ అంకాలు, గంగయ్య పాత్రలను పరిచయం చేసి.. గ్రిప్పింగ్ ఇంటర్వెల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక సెకండాఫ్‌లో కథ ఊహించని మలుపు తీసుకుంటుది. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించకపోవచ్చు. ముఖ్యంగా అధిక హింసతో కూడుకున్న సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవు. జాన్ కె జోసెఫ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. విశాఖ మురళీదరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ అని చెప్పొచ్చు. రేవంత్ సాగర్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని, కోస్తా ప్రాంతాన్ని అందంగా చిత్రీకరించి, వాస్తవికతను జోడించింది. అయితే శివ శర్వాని ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాతలుగా తమ అభిరుచిని చాటారు. నిర్మాణాన్ని పర్యవేక్షించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు పర్వతనేని ఈ ప్రాజెక్ట్ చేయడంలో తమ అనుభవాన్ని చూపించారు. ఓవరాల్‌గా చెప్పాలంటే సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మినహాయిస్తే.. రేవు మంచి చూడదగిన చిత్రంగా చెప్పొచ్చు.
Rating : 2.75 / 5