Brahmavaram PS Paridhilo Review: ఆద్యంతం ఆసక్తికరంగా బ్రహ్మవరం పి.ఎస్‌ పరిధిలో.. కథెంటంటే.. ?

Brahmavaram PS Paridhilo Review: ఆద్యంతం ఆసక్తికరంగా బ్రహ్మవరం పి.ఎస్‌ పరిధిలో.. కథెంటంటే.. ?

Update: 2024-08-23 10:00 GMT

Bhimavaram PS Paridhilo Review: ఆద్యంతం ఆసక్తికరంగా బ్రహ్మవరం పి.ఎస్‌ పరిధిలో.. కథెంటంటే.. ?

ప్రస్తుతం క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ చిత్రాలకు ఆదరణ భారీగా పెరుగుతోంది. ఇటు థియేటర్లతో పాటు, అటు ఓటీల్లోనూ ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి జోనర్‌లో తాజాగా మరో చిత్రం వచ్చింది. డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై “బ్రహ్మ వరం పి.ఎస్. పరిధిలో” అనే సినిమా తెరకెక్కింది. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో ఈరోజు మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

సినిమా కథ విషయానికొస్తే.. అమెరికాలో ట్రావెల్ రిస్త్రీక్షన్ తీసేయడంతో.. (స్రవంతి) చైత్ర ఇండియాలోని బ్రహ్మవరంకి బయల్దేరుతుంది. అదే రోజు రాత్రి బ్రహ్మవరంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక శవం పడి ఉంటుంది. అక్కడి నుంచి కథ 99 రోజుల వెనక్కి వెళుతుంది. సాప్ట్ వేర్ ఉద్యగిని అయిన చైత్ర , సూర్య (సూర్య శ్రీనివాస్) ని ప్రేమిస్తుంది. ఈ కథకి సమాంతరంగా మరో కథ (గౌతమ్‌-గురుచరణ్‌) నడుస్తుంది. గౌతమ్ తండ్రి (ప్రేమ సాగర్) పట్టాభి కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. స్టేషన్‌లోని ఎస్‌ఐతో అతనికి విభేదాలు ఉంటాయి. అసలు చైత్ర , ఎందుకు బ్రహ్మవరం వచ్చింది. సూర్య కి ఏమైంది.? గౌతమ్ చైత్ర ఎలా, ఎందుకు కలిశారు.? పోలీస్ స్టేషన్ దగ్గర పడిన శవం ఎవరిది.? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక నటీనటుల విషయానికొస్తే.. స్రవంతి బెల్లంకొండ, గురు చరణ్, సూర్య శ్రీనివాస్, హర్షిని కోడూరు, రూప లక్ష్మీ, ప్రేమ్ సాగర్ , సమ్మెట గాంధీ, రుద్ర తిప్పే స్వామి ఈ సినిమాలో వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా స్రవంతి నటన బాగుంది. సినిమా చూసిన తర్వాత కూడా పాత్రలు మనల్ని వదిలిపెట్టవు. దర్శకుడు ఇమ్రాన్ శాస్త్రి ఎంచుకున్న కథ సినిమాకే హైలెట్‌గా నిలిచిందని చెప్పాలి.

కథను తెరమీద చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కథను గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. సాకేత్ శ్రీరామ్ అందించిన పాటలు బాగున్నాయి. అలాగే శ్రీ వెంకట్ అంధించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా సెట్ అయ్యింది. ఇలాంటి థ్రిల్లింగ్ సస్పెన్స్ కథలకు ఆర్ఆర్ బాగా కుదరాలి, ఈ సినిమాకు శ్రీ వెంకట్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ముజీర్ మాలిక్ కెమెరా వర్క్ కూడా మెప్పిస్తుంది. మొత్తం మీద బ్రహ్మవరం పి.ఎస్‌ పరిధిలో రోటీన్‌కు భిన్నంగా సినిమాలు చూసే వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News