Shambala Movie Review: శంబాల మూవీ రివ్యూ.. వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్!

Shambala Movie Review: వింతలు, భయానక ఘటనలు, మిస్టరీతో నిండిన కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చిన సినిమాల జాబితాలో ఇప్పుడు ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన “శంబాల” కూడా చేరింది.

Update: 2025-12-24 16:21 GMT

Shambala Movie Review: వింతలు, భయానక ఘటనలు, మిస్టరీతో నిండిన కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చిన సినిమాల జాబితాలో ఇప్పుడు ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన “శంబాల” కూడా చేరింది. టీజర్, ట్రైలర్‌లతో ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఆసక్తిని పెంచిన ఈ సినిమా, థియేటర్‌లోకి అడుగుపెట్టగానే ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. హారర్, మిథాలజీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ మేళవించిన ఈ చిత్రంలో కథ, నటన, టెక్నికల్ వర్క్ ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ప్రేక్షకులకు నిజంగా భయాన్ని, ఉత్కంఠను కలిగించగలిగిందా? అన్నది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.

కథ

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శంబాల గ్రామంలో 80వ దశకంలో ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. ఆ ఉల్కను ఊరి జనం “బండ భూతం”గా పిలుస్తారు. అది పడిన నాటి నుంచి గ్రామంలో అనూహ్యమైన, భయానక ఘటనలు మొదలవుతాయి. రాములు ఆవు నుంచి పాలకు బదులుగా రక్తం రావడం, వరుసగా హత్యలు–ఆత్మహత్యలు జరగడం ఊరంతా కలవరానికి గురిచేస్తాయి.

ఈ రహస్యాల్ని ఛేదించేందుకు ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయి కుమార్)ని శంబాల గ్రామానికి పంపిస్తుంది. విక్రమ్ అక్కడికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలేంటి? దేవి (అర్చన ఐయ్యర్) పాత్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? శంబాల గ్రామ చరిత్ర, గ్రామ దేవత కథ ఏమిటి? ఈ వింత ఘటనలకు ముగింపు ఎలా పడింది? అన్నది థియేటర్లో అనుభవించాల్సిందే.

నటీనటుల నటన

ఆది సాయి కుమార్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త లుక్‌లో, ఇంటెన్స్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ పవర్‌ఫుల్‌గా ఉంది. దేవి పాత్రలో అర్చన ఐయ్యర్ అందరికీ సర్‌ప్రైజ్ ప్యాకేజ్. రవి వర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్ పాత్రలు భయాన్ని పుట్టిస్తాయి. బేబీ చైత్ర పాత్ర కూడా గుర్తుండిపోతుంది. సహాయ పాత్రలన్నీ కథలో భాగంగా బలంగా నిలుస్తాయి – ఏ పాత్ర కూడా అప్రయోజనంగా అనిపించదు.

విశ్లేషణ

దర్శకుడు యుగంధర్ ముని టీజర్, ట్రైలర్‌లతో కథను అస్సలు రివీల్ చేయకుండా థియేటర్‌లో కొత్త ప్రపంచాన్ని చూపించారు. శంబాల గ్రామాన్ని ఒక ప్రత్యేకమైన వరల్డ్‌లా ఆవిష్కరించడంలో ఆయన విజయం సాధించారు.

ఫస్ట్ హాఫ్ గ్రామ పరిచయం, చరిత్ర, భయానక సంఘటనలతో నెమ్మదిగా టెన్షన్ పెంచుతుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం గూస్‌బంప్స్ గ్యారంటీ.

సెకండాఫ్ మొత్తం వేగంగా సాగుతుంది. సమస్య మూలం, దానికి పరిష్కారం అన్వేషణతో కథ క్లైమాక్స్ వైపు పరుగులు తీస్తుంది. అయితే క్లైమాక్స్ కొందరికి కాస్త వీక్‌గా అనిపించవచ్చు.

టెక్నికల్ అంశాలు

ఈ సినిమాకు నిజమైన హీరోలు సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం – కేవలం సౌండ్‌తోనే భయపెట్టగలగడం ఈ చిత్ర ప్రత్యేకత. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ టాప్ నాచ్. పాటలు పెద్దగా గుర్తుండకపోయినా, డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. షైనింగ్ పిక్చర్స్ మేకింగ్ క్వాలిటీ ఖర్చుకు తగిన అవుట్‌పుట్ ఇచ్చింది.

మొత్తం మీద

హారర్, మిస్టరీ, మిథాలజీ కలబోసిన డిఫరెంట్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు శంబాల మంచి అనుభవాన్ని ఇస్తుంది. కొత్త కథనం, బలమైన టెక్నికల్ వర్క్‌తో ఈ సినిమా థియేటర్‌లో చూడదగ్గది.

రేటింగ్: 3.5 / 5

Tags:    

Similar News