Blood Roses Movie Review: బ్లడ్ రోజెస్ సినిమా రివ్యూ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన థ్రిల్లర్..!
Blood Roses Movie Review: టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నాగన్న, కె. లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా, ఎల్లప్ప కో-ప్రొడ్యూసర్‌గా ఎంజిఆర్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “బ్లడ్ రోజెస్”. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ :
హైదరాబాద్ నగరంలో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు రాజకీయ నాయకులు ఉంటారు. వచ్చే ఎన్నికల్లో తమ కుమారులను రాజకీయాల్లో నిలబెట్టాలని ఇద్దరూ ప్రయత్నిస్తుంటారు. అయితే, అదే సమయంలో నగరంలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. ఈ హత్యలకు దేవి దాస్ కుమారుడు మదన్‌కు సంబంధం ఉందని మీడియా కథనాలు వెలువడతాయి. దీంతో దేవి దాస్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి భజరంగి దాస్ చేసిన కుట్రగా భావించిన దేవి దాస్ అనుచరులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను తీసుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్‌గా విచారణ ప్రారంభిస్తాడు. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అతడిని సస్పెండ్ చేస్తారు. కేసు సీబీఐకి వెళ్లే పరిస్థితి ఏర్పడినా, కమిషనర్ అభ్యర్థనపై హోమ్ మినిస్టర్ ఒప్పుకుని, ఈ కేసును అధిరకి అప్పగిస్తారు. వరుస హత్యల వెనుక ఉన్న అసలు హంతకుడెవరు? అధిర ఈ కేసును ఎలా ఛేదించింది? అనేదే ఈ సినిమా కథాంశం.
విశ్లేషణ :
ఈ సినిమా ద్వారా మహిళలను తక్కువగా చూడకూడదు, వారు ప్రతి విషయంలో సమానమే అనే బలమైన సందేశం ఇస్తారు. మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలి, ప్రేమిస్తే మోసం చేయకూడదు అనే అంశాలను హీరోయిన్ పాత్ర ద్వారా చక్కగా చూపించారు. 2026లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాల జాబితాలో “బ్లడ్ రోజెస్” తప్పకుండా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది.
నటీనటుల ప్రదర్శన :
ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడవచ్చు. అధిర పాత్రలో అప్సర రాణి లుక్ పూర్తిగా కొత్తగా ఉంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. ఆమెకు “బ్లడ్ రోజెస్ ముందు – బ్లడ్ రోజెస్ తర్వాత” అనే గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. శాండల్‌వుడ్ హీరో ధర్మ కీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. కర్ణాటకలో చేసిన 20 సినిమాలకన్నా ఈ పాత్ర అతనికి మంచి పేరు తీసుకొస్తుంది.
శ్రీలు పృథ్విరాజ్ జనని పాత్రలో కీలకంగా కనిపించి, హంతకుడిని పట్టుకునే ప్రక్రియలో బలమైన సపోర్ట్ ఇస్తుంది. క్రాంతి కిల్లి మార్టిన్ పాత్రలో ఇప్పటివరకు చేసిన నెగటివ్ క్యారెక్టర్లకు భిన్నంగా, ఈ సినిమాలో పాజిటివ్ పాత్రలో మెప్పించాడు. అతని పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్‌కు సమాంతరంగా ట్రావెల్ అవుతూ కథను ముందుకు నడిపిస్తుంది.
ఇక సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదీశ్వరి, మాణికుమార్, మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్, ధ్రువ, నరేన్ తేజ్, ప్రగ్య, నవిత, లౌక్య, హాసిని, ఆనంద్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకత్వం :
దర్శకుడు ఎం.జి.ఆర్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లేను పక్కాగా రూపొందించారు. తెలుగు మరియు కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీలలో ప్రముఖ దర్శకుల దగ్గర పని చేసి, కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలకు కథలు చెప్పి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో రెండు సినిమాలు చేసిన తర్వాత,**“బ్లడ్ రోజెస్”**తో తెలుగులో దర్శకుడిగా మంచి ఆరంభం చేశారు.
మొత్తానికి, సస్పెన్స్, రాజకీయ నేపథ్యం, సోషల్ మెసేజ్‌ల మేళవింపుతో తెరకెక్కిన “బ్లడ్ రోజెస్” ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు.
రేటింగ్: 3/5