యుగపురుషుడిగా ఎన్టీఆర్

Update: 2019-02-23 10:45 GMT

మహానటుడు ఎన్టీఆర్ నటించిన ఎన్నో చిత్రాలలో యుగపురుషుడు యువతరన్ని ఆకర్షించి, ఆనందాన్ని పంచిన సినిమా. ఇది 1978 లో కె. బాపయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఎన్.టి.ఆర్., కె. బాపయ్య, అశ్వనీదత్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం 'ఎదురులేని మనిషి' తరువాత అదే కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం యుగపురుషుడు. 1978, జూలై 14న విడుదలైన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., జయప్రదల మధ్య శృంగార సన్నివేశాలు కొత్త తరహాలో ఉండడంతోపాటు యువతరాన్ని ఆకర్షించే అనేక అంశాలు ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత. ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా చూడకుంటే ఒక సారి చూడండి. శ్రీ.కో 

Similar News