Health: వెల్లుల్లితో ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయా.? తెలిస్తే అస్సలు వదలరు..!

Garlic Health Benefits: వంటింట్లో కచ్చితంగా ఉండే పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా వెల్లుల్లిని ఉపయోగించాల్సిందే.

Update: 2025-03-07 11:59 GMT

Health: వెల్లుల్లితో ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయా.? తెలిస్తే అస్సలు వదలరు..!

Garlic Health Benefits: వంటింట్లో కచ్చితంగా ఉండే పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా వెల్లుల్లిని ఉపయోగించాల్సిందే. వంటకు రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వెల్లుల్లిన ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి శాస్త్రీయ నామం అల్లియం సాటివమ్ ఎల్. ఇది పురాతన కాలం నుంచి ఔషధనల్లో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంతో పాటు వంటగది రెండింటిలోనూ వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. వెల్లుల్లిని తింటే అల్లిసిన్ అనే సమ్మేళనం విడుదలవుతుంది, ఇది యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలో ప్రోటీన్, ఎంజైమ్‌లు, విటమిన్ బి, సాపోనిన్, ఫ్లేవనాయిడ్ వంటి పోషకాలు ఉంటాయి.

వెల్లుల్లి శరీర బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది సహజ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల పక్షవాతం, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మెడ-వెన్ను నొప్పి, ఉబ్బసం, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరచి, గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇది మూత్రాశయం, కాలేయం సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. ఆకలిని పెంచి, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 2015లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఉపవాస సమయంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ప్రతి రోజు కొద్ది మొత్తంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News