GHMC Elections 2020: గ్రేటర్ సమరం ప్రారంభం.. లైవ్ అప్ డేట్స్!

Update: 2020-12-01 01:24 GMT
Live Updates - Page 3
2020-12-01 02:00 GMT

కుందన్ బాగ్ లో మొదటి ఓటు వినియోగించుకున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు

2020-12-01 01:43 GMT

ఏపార్టీ ఎన్ని స్థానాల్లో..

*గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ 150 అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.

*నవాబ్ సాహెబ్‌కుంట తప్ప మిగతా 149 చోట్ల భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు.

*కాంగ్రెస్ 146,

*తెలంగాణ తెలుగుదేశం 106,

#మజ్లిస్ 51 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. 

2020-12-01 01:41 GMT

మీరు ఓటు వేసే పోలింగ్ కేంద్రం ఎక్కడుందో ఇలా తెలుసుకోవచ్చు..

సాంకేతిక సహకారంతో మీరు ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం ఎక్కడుందో.. అక్కడికి ఎలా చేరుకోవచ్చో సులువుగా తెలిసే అవకాశం దొరికింది. ఎన్నికల సంఘం ఈ మేరకు ప్రత్యెక ఏర్పాట్లు చేసింది. myghmc యాప్ లో locate your poling station లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం చిరునామా సులువుగా తెలుసుకోవచ్చు. ఇందులో మీ ఓటర్ ఐడీ, పేరు ఇవ్వడం ద్వారా మీ పోలింగ్ కేంద్రానికి దారి సులభంగా తెలుస్తుంది. 

2020-12-01 01:36 GMT

18 సంవత్సరాల తరువాత తొలిసారిగా..

* ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. 18 సంవత్సరాల తరువాత ఇలా జరుగుతోంది.

*కొవిడ్ నిబంధనలతో..కరోనా నేపథ్యంలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

*తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఓటింగ్ కోసం వినియోగిస్తున్నారు.

*మొత్తం 81 లక్షల 88 వేల686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు.

*పోలింగ్ కోసం 28వేల683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. 

2020-12-01 01:27 GMT

'గ్రేటర్' ఎన్నికలు..

*బల్దియాలో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256, పురుషులు 38,89,637, స్త్రీలు 35,76,941 ఇతరులు 678

* మొత్తం వార్డుల సంఖ్య 150, పోటి చేసే అభ్యర్తుల సంఖ్య 1122

*కొండాపూర్ డివిజన్‌లో అత్యధికంగా... 99 పోలింగ్ కేంద్రాలు

*అత్యల్పంగా రామచంద్రాపురం డివిజన్‌లో 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

*48వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు 

Tags:    

Similar News