GHMC Elections 2020: గ్రేటర్ సమరం ప్రారంభం.. లైవ్ అప్ డేట్స్!

GHMC Elections 2020 Live Updates in Telugu
x

GHMC Elections 2020 Live Updates

Highlights

GHMC Elections 2020: అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మొదలయ్యాయి. ఓటర్లు తమ తీర్పు ఇవ్వడం కోసం పోలింగ్ బాట పట్టారు. ఆ వివరాలు ఎప్పటికప్పుడు..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మొదలయ్యాయి. మొత్తం 150 వార్డులలో..1122 మంది అభ్యర్థుల భవితవ్యం పై ఓటు ముద్ర పడటం ప్రారంభం అయింది. బల్దియాలో మొత్తం 38,89,637 మంది పురుషులు, 35,76,941 స్త్రీలు, 678 ఇతరులు కలిపి మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

బల్దియా ఎన్నికల సరళిపై తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకోసం

Show Full Article

Live Updates

  • కాషాయం మాస్క్ తొ ఓటేసిన విజయశాంతి
    1 Dec 2020 6:31 AM GMT

    కాషాయం మాస్క్ తొ ఓటేసిన విజయశాంతి

    సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు. ఓటు వేసేందుకు వచ్చిన విజయశాంతి కాషాయం రంగు మాస్క్ ధరించడం విశేషం 

  • 1 Dec 2020 6:28 AM GMT

    ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా గాయకుడు గద్దర్

    అల్వాల్ వెంకటాపురం 135 డివిజన్ మహాబోధి స్కూల్లో ప్రజా గాయకుడు గద్దర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, నవ భారతాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. యువకులపై తాను రాసిన పాటలు వినిపించారు.

  • 1 Dec 2020 6:26 AM GMT

    ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు విజయ్ దేవరకొండ

    జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజంలంతా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కచ్చితంగా ఓటు వేయడానికి ముందుకు రావాలని విజయ్ పిలుపునిచ్చారు.

  • 1 Dec 2020 6:25 AM GMT

    బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం

    బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కాషాయం రంగు మాస్కులు పెట్టుకొని పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారని టీఆర్ఎస్ వర్గీయులు.. చేతికి గులాబీ రంగు కంకణాలు కట్టుకుని వచ్చారంటూ బీజేపీ వర్గీయులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. గులాబీ కండువాలతో పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించిన బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి.. ఇదేమిటి అంటూ బీజేపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ స్టేషన్లు 43, 44, 45, 46, 47, 48, 49 వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

  • 1 Dec 2020 6:21 AM GMT

    పోలింగ్ పర్సంటేజ్ 11 గంటల వరకు


    శేరిలింగంపల్లి సర్కిల్ పరిదిలోని 3 డివిజన్ లలో *6.42 పర్సంటేజ్

    104 కొండాపూర్ డివిజన్ 5 పర్సంటేజ్

    105 గచ్చిబౌలి డివిజన్ 6.61 పర్సంటేజ్

    106 శేరిలింగంపల్లి డివిజన్ 7.80 పర్సంటేజ్

    చందానగర్ సర్కిల్ పరిదిలోని 4 డివిజన్ లలో 9.42 పర్సంటేజ్

    107 మాదాపూర్ డివిజన్ 6.15 పర్సంటేజ్

    108 మియాపూర్ డివిజన్ 9.29 పర్సంటేజ్

    109 హఫీజ్ పేట్ డివిజన్ 9.71 పర్సంటేజ్

    110 చందానగర్ డివిజన్ 13.12 పర్సంటేజ్

  • 1 Dec 2020 4:29 AM GMT

    ఓటేసిన దర్శకుడు తేజ దంపతులు

    దర్శకుడు తేజ దంపతులు జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ కూడా ఇక్కడ ఓటు వేశారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగిచుకోవాలని వారు కోరారు.

  • 1 Dec 2020 4:26 AM GMT

    హఫీజ్ పేటలో టెన్షన్ టెన్షన్.


    గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సమయంలో హఫీజ్ పేట డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫోటోలు ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ పార్టీ కార్యకర్తలు.

    అయితే దీనిపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

    తీవ్రమైన తోపులాటకు దారితీసింది చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించడంతో.. బీజేపీ కార్యకర్తలు శాంతించారు.

    మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది.

    ఉదయమే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    అంతా వచ్చి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

  • 1 Dec 2020 4:14 AM GMT

    ఆలోచించి ఓటేయండి..సినీనటుడు ఆలీ

    భావి తరాల అభివృద్ధిని నిర్దేశించే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకూడదు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా ఓటేయాలి. ఏమీ ఆశించకుండా ఓటేసినప్పుడే అభివృద్ధిపై నాయకులను ప్రశ్నించే వీలు కలుగుతుంది.

  • 1 Dec 2020 4:06 AM GMT

    ఆలోచించి ఓటేయండి..సినీనటుడు ఆలీ

    భావి తరాల అభివృద్ధిని నిర్దేశించే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకూడదు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా ఓటేయాలి. ఏమీ ఆశించకుండా ఓటేసినప్పుడే అభివృద్ధిపై నాయకులను ప్రశ్నించే వీలు కలుగుతుంది.

  • 1 Dec 2020 3:37 AM GMT

    పోలింగ్ కేంద్రాల్లోనికి సెల్ఫోన్లో అనుమతించకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్న ఓటర్లు...

    మళ్ళీ ఇంటికి వెళ్లి ఫోన్లు భద్రపరుచుకుని వస్తున్న ఓటర్లు.

Print Article
Next Story
More Stories