GHMC Elections 2020: గ్రేటర్ సమరం ప్రారంభం.. లైవ్ అప్ డేట్స్!
GHMC Elections 2020: అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మొదలయ్యాయి. ఓటర్లు తమ తీర్పు ఇవ్వడం కోసం పోలింగ్ బాట పట్టారు. ఆ వివరాలు ఎప్పటికప్పుడు..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మొదలయ్యాయి. మొత్తం 150 వార్డులలో..1122 మంది అభ్యర్థుల భవితవ్యం పై ఓటు ముద్ర పడటం ప్రారంభం అయింది. బల్దియాలో మొత్తం 38,89,637 మంది పురుషులు, 35,76,941 స్త్రీలు, 678 ఇతరులు కలిపి మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
బల్దియా ఎన్నికల సరళిపై తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకోసం
Live Updates
- 1 Dec 2020 8:47 AM IST
హఫీజ్ పేట్ డివిజన్ లో కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీఆరెస్ అభ్యర్థులు ఫ్లెక్సీ ఏర్పాట్లు చేయడంపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆర్కే పురం పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఘర్షణ ఏర్పడింది.
- 1 Dec 2020 8:36 AM IST
ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రిపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోరబండలోని సైట్‌వన్ పోలింగ్ కేంద్రంలో ఉపమేయర్ బాబా ఫసియుద్దీన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- 1 Dec 2020 8:31 AM IST
కుందన్ బాగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ చీఫ్ జస్టీస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్.
- 1 Dec 2020 8:10 AM IST
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల దీక్ష.
Ghmc ఎన్నికల్లో trs అధికార దుర్వినియోగాన్ని నిరసిస్తూ ఉపవాస దీక్ష దీక్ష.దీక్షలో కూర్చోనున్న పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , మాజీ ఎంపీ వివేక్
- 1 Dec 2020 7:54 AM IST
ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ సజ్జనార్
సైబరాబాద్ సీపీ సజ్జనార్ జీహెచ్‌ఎసీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సజ్జనార్ ఓటు వేశారు. అదేవిధంగా కుందన్‌బాగ్ చిన్మయి స్కూల్‌లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- 1 Dec 2020 7:46 AM IST
జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు డివిజన్‌లో 20వ పోలింగ్ కేంద్రంలో ఇంకా ఓటింగ్ ప్రారంభం కాలేదు.
- 1 Dec 2020 7:44 AM IST
* కాచిగూడాలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
*నందినగర్ లో ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
* జూబ్లీ క్లబ్ వద్ద ఓటుహక్కు వినియోగించుకున్న చిరంజీవి దంపతులు
- 1 Dec 2020 7:31 AM IST
జిహెచ్ఎంసి ఎన్నికల్లో సకాలంలో చాలాచోట్ల పోలింగ్ కేంద్రాలకు చేరుకోని ఏజెంట్లు...
ప్రారంభం కానీ ఓటింగ్ ప్రక్రియ.





