GHMC Elections 2020: గ్రేటర్ సమరం ప్రారంభం.. లైవ్ అప్ డేట్స్!

Update: 2020-12-01 01:24 GMT
Live Updates - Page 2
2020-12-01 03:17 GMT

హఫీజ్ పేట్ డివిజన్ లో కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీఆరెస్ అభ్యర్థులు ఫ్లెక్సీ ఏర్పాట్లు చేయడంపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆర్కే పురం పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఘర్షణ ఏర్పడింది. 

2020-12-01 03:06 GMT

ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ శాస్త్రిపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోరబండలోని సైట్‌వన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఉపమేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2020-12-01 03:01 GMT

కుందన్ బాగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ చీఫ్ జస్టీస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్.

2020-12-01 02:40 GMT

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల దీక్ష.


Ghmc ఎన్నికల్లో trs అధికార దుర్వినియోగాన్ని నిరసిస్తూ ఉపవాస దీక్ష దీక్ష.

దీక్షలో కూర్చోనున్న పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , మాజీ ఎంపీ వివేక్ 

2020-12-01 02:24 GMT

ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ సజ్జనార్

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ జీహెచ్‌ఎసీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సజ్జనార్‌ ఓటు వేశారు. అదేవిధంగా కుందన్‌బాగ్‌ చిన్మయి స్కూల్‌లో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2020-12-01 02:16 GMT

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు డివిజన్‌లో 20వ పోలింగ్‌ కేంద్రంలో ఇంకా ఓటింగ్‌ ప్రారంభం కాలేదు.

2020-12-01 02:14 GMT

* కాచిగూడాలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

*నందినగర్ లో ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్ 

* జూబ్లీ క్లబ్ వద్ద ఓటుహక్కు వినియోగించుకున్న చిరంజీవి దంపతులు 


2020-12-01 02:01 GMT

జిహెచ్ఎంసి ఎన్నికల్లో సకాలంలో చాలాచోట్ల పోలింగ్ కేంద్రాలకు చేరుకోని ఏజెంట్లు...

ప్రారంభం కానీ ఓటింగ్ ప్రక్రియ.

Tags:    

Similar News