Live Updates:ఈరోజు (జూన్-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-07 01:09 GMT

ఈరోజు ఆదివారం, 07 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, విదియ (రాత్రి 10:55 వరకు), తదుపరి తదియ, మూలా నక్షత్రం (మధ్యాహ్నం 02.10 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:48 pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-06-07 16:11 GMT

-ఈ రోజు అధికంగా 154కేసులు నమోదయ్యాయి.

-మొత్తం కేసుల సంఖ్య 3,650కి చేరింది.

-కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1742 మంది డిశ్చార్జ్ అయ్యారు.

-ఇప్పటి వరకు 137 మంది మరణించారు.

-ప్రస్తుతం రాష్ట్రంలో 1,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

2020-06-07 11:55 GMT

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించగల సమర్ధులైన నాయకులు ముఖ్యమంత్రులు గా ఉన్నారు...

కేసీఆర్ ఏదైనా చెపితే, జగన్ వింటారు, జగన్ రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ ఆలోచిస్తారు...

--పోసాని కృష్ణమురళి

2020-06-07 10:40 GMT

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందా మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.


                                                                          - పూర్తి వివరాలు

 

     

2020-06-07 10:26 GMT

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కోనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈఓజు ఉదయం 9 గంటల వరకూ) మొత్తం 17,695 శాంపిల్స్ ను పరీక్షించారు. దాంతో కొత్తగా మరో 130 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో పేర్కొంది. 


                                                                    - పూర్తి వివరాలు

 

                                              

2020-06-07 08:37 GMT

గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. బోర్డర్‌లో తనిఖీల్లేవు

అమరావతి: ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలను అనుమతించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మూడు నెలల తరువాత ఎటువంటి అనుమతులు లేకుండా రాష్ట్ర సరిహద్దులు తెరుచుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులతో రాకపోకలు జోరందుకోనున్నాయి..

2020-06-07 08:23 GMT

విశాఖ

లాక్ డౌన్ నిభందనలు ఉల్లంగించి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలిసులు

2020-06-07 08:23 GMT

తూ.గో.జిల్లా

మామిడికుదురు మండలంలో దారుణం. మైనర్ బాలికపై అత్యాచారం

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిఅత్యాచారం చేసిన యువకుడు.మహేష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

2020-06-07 08:23 GMT

కడప

దువ్వూరు వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొని దగ్ధమైన లారీ. మంటల్లో సజీవ దహనమైన లారీ డ్రైవర్

2020-06-07 08:22 GMT

విశాఖ

విశాఖ బీచ్ లో డివైడర్ డీ కొని ప్రమాధానికి గురైన ద్విచక్ర వాహనం... బీ టె విధ్యార్దులు మృతి

2020-06-07 08:22 GMT

విశాఖజిల్లా:

నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీసులో మంచినీళ్లు అనుకొని పొరపాటుగా శానిటైజర్ తాగిన అటెండర్ సత్తిబాబు

-అస్వస్థతకు గురికావడంతో హుటాహుటీన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలింపు.,

-అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం లో చికిత్స పొందుతూ సత్తిబాబు మృతి.

Tags:    

Similar News