ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కోనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈఓజు ఉదయం 9 గంటల వరకూ) మొత్తం 17,695 శాంపిల్స్ ను పరీక్షించారు.

Raj
By Raj
Published on: 7 Jun 2020 1:16 PM IST
ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
X

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కోనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈఓజు ఉదయం 9 గంటల వరకూ) మొత్తం 17,695 శాంపిల్స్ ను పరీక్షించారు.దాంతో కొత్తగా మరో 130 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,718కి చేరింది.

అలాగే గత 24 గంటల్లో 30 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 2.353 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1290 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో కృష్ణ లో ఒకరు కర్నూల్ లో ఒకరు మృతిచెందారు. కాగా ఇప్పటివరకూ 75 మంది మృతి చెందారు.


Raj

Raj

Next Story