Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-22 01:40 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19.

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు జేజేలు!

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-08-22 18:02 GMT

సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులో టైర్ల ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

దాంతో భారీగా పొగలు, మంటలతో ఆ ప్రాంతం కమ్ముకుపోయింది.

దాంతో గుమ్మడిదల గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు.

పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.  

ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గుమ్మడిదల ప్రాంతంలో ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రమాదంలో ఎంత నష్టం జరిగింది.? గోడౌన్‌లో ఎంత మంది ఉన్నారు?. అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

2020-08-22 15:39 GMT

కామారెడ్డి : నిండు కుండాలా మారిన కౌలాస్ నాలా.

పూర్తి స్థాయి నీటిమట్టం 458 అడుగులు ప్రస్తుతం 457.75 అడుగులు.

ఏ క్షణంలో నైనా.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల

చేయనున్న అధికారులు.

కౌలాస్ నాలా వాగు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.

జుక్కల్, బిచ్కుంద, పెద్ద కడప గల్ మండలాల ప్రజలు అలెర్ట్ చేసిన అధికారులు.

2020-08-22 12:25 GMT

- ఖైరతాబాద్ గణేష్ వద్ద ప్రారంభమైన దర్శనాలు

- పరదా తొలగించి దర్శనానికి అనుమతి ఇచ్చిన నిర్వాహకులు

- ఇంట్లో నే ఆన్లైన్ దర్శనం చేసుకోవాలి అని చెప్పినా పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు

2020-08-22 12:24 GMT

- కేసీఆర్ సంకల్ప బలం, మిషన్ కాకతీయ సాధించిన గొప్ప విజయం.

- రాష్ట్ర వ్యాప్తంగా జలకళ తో చెరువులు నిండు కుండల్లా కళకళలాడుతున్న సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్న మంత్రి హరీష్ రావు.

- ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో ఆరంభించిన ‘మిషన్ కాకతీయ’ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది.

- తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ యజ్ఙం ఎంతగా విజయవంతమైందో ఈ వర్షాకాలం కళ్లకు కట్టినట్టు నిరూపిస్తోంది.

- మిషన్ కాకతీయ ద్వారా పటిష్టమైన మత్తడులు జలపాతాలను తలపిస్తున్నాయి.

- చెరువు గట్లు భారీ వర్షాలను తట్టుకుంటూ దుర్బేధ్యమైన కోట గోడలుగా మారాయి.

- తెలంగాణ వ్యాప్తంగా ఎడతెగకుండా కురుస్తున్నవర్షాలతో చెరువులన్నీ నిండు కుండల్లా కళకళలాడుతున్నాయి.

- ఇది కేసీఆర్ సంకల్ప బలం, మిషన్ కాకతీయ సాధించిన గొప్ప విజయం!

2020-08-22 12:14 GMT

- తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

- తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ఆర్.సి కుంతియా*

- తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుంది..

- రాజ్యాంగ పరంగా ప్రజలకు సంక్రమించిన హక్కులను టిఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తుంది..

- ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే శ్రీశైలం లో దుర్ఘటన జరిగింది..

- తెలంగాణ ఉద్యమాలు చేస్తే ముందస్తుగా అరెస్టులు, గృహ నిర్బందాలు చేయడం ఆనవాయితీ అయ్యింది.

- శ్రీశైలం లో జరిగిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

- సంఘటనా స్థలానికి వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి లను అరెస్ట్ చేయడం అక్రమం.. వారిని వెంటనే విడుదల చేసి బాధితులను ప్రమర్శించేలా చర్యలు తీసుకోవాలి..

2020-08-22 12:13 GMT

కరీంనగర్ :

- లోయర్ మానేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు.. పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్

- LMD ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల

- ప్రాజెక్టు ఇన్ ఫ్లో 23 వేల క్యూసెక్స్

- మూడు గేట్ల ద్వారా అవుట్ ఫ్లో 6 వేల క్యూసెక్స్

2020-08-22 12:12 GMT

నల్గొండ :

- నాగార్జునసాగర్ ప్రాజెక్టు20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల...

- ఇన్ ఫ్లో :4,49,773 క్యూసెక్కులు.

- అవుట్ ఫ్లో : 4,49,773 క్యూసెక్కులు.

- పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

- ప్రస్తుత నీటి నిల్వ : 307 టీఎంసీలు.

- పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

- ప్రస్తుత నీటిమట్టం: 588.20 అడుగులు.

2020-08-22 11:42 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

- కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరోసారి బయటపడ్డా డొల్లతనం.

- గ్రావిటీ కెనాల్ పనుల్లో నాణ్యత లేకపోవడంతో కుంగి కూలిపోతున్న వైనం.

- కన్నెపల్లి పంపు హౌస్ నుండి అన్నారం బ్యారేజి వరకు వేసిన గ్రావిటీ కెనాల్.

- గతంలో పెచ్చులుడి , సిమెంట్ కొట్టుకుపోయిన గ్రావిటీ కెనాల్ .

- మొత్తం కెనాల్ 13.6 కి. మీ..

- మరమ్మతులు చేపట్టిన చోట మళ్ళీ సిమెంట్ గోడ పెచ్చులుడుతున్న వైనం.

2020-08-22 11:31 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

- లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

- ప్రస్తుత సామర్థ్యం 94.30 మీటర్లు

- పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

- ప్రస్తుత సామర్థ్యం 3.686 టీఎంసీ

- ఇన్ ఫ్లో 3,46,730 క్యూసెక్కులు

- ఓట్ ఫ్లో 3,46,730 క్యూసెక్కులు

2020-08-22 11:30 GMT

జాతీయం

- దేశంలోని అన్ని రాష్ట్రాల ఛీప్ సెక్రటరీ లకు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా లేఖ

- అంతర్ రాష్ట్ర , ఒక రాష్ట్ర రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వ్యక్తుల కదలికలు, వస్తువుల సరఫరా పై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని లేఖలో పేర్కొన్న కేంద్ర హోం సెక్రటరీ

- ఏ రాష్ట్ర మైనా ఆంక్షలు విధించినట్లయితే అది కేంద్ర హోం శాఖ జారీచేసిన ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని లేఖలో పేర్కొన్న కేంద్ర హోం సెక్రటరీ

Tags:    

Similar News