Happy Birthday Megastar Chiranjeevi : అందరివాడు..మెగాస్టార్ కి పుట్టినరోజు జేజేలు!

Happy Birthday Megastar Chiranjeevi : అందరివాడు..మెగాస్టార్ కి పుట్టినరోజు జేజేలు!
x

Chiranjeevi 

Highlights

Happy Birthday Megastar Chiranjeevi : చిరంజీవి.. యువ నటులకు ఒక స్ఫూర్తి. మెగాస్టార్.. కష్టం నుంచి తారాస్థాయికి ఒక మనిషి ఎలా ఎదగోచ్చో చెప్పే జీవన పాఠం!

Happy Birthday Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. 'పునాదిరాళ్ల'తో ఇండస్ట్రీలో పునాది వేసుకొని 'స్వయంకృషి'తో ఎదురైన ప్రతి 'ఛాలెంజ్' లను 'మగధీరుడు' లాగా ఎదుర్కుంటూ 'విజేత'గా నిలిచి 'మగమహారాజు' లాగా ప్రేక్షకుల మనసులను గెలుచుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుప్రీంహీరో లా నిలిచారు మన 'అందరివాడు' చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వస్తూనే ఉంటారు కూడా.. అలాంటి వాళ్ళకి ఒక్కరే స్ఫూర్తి ఆయనే మెగాస్టార్ చిరంజీవి.. 150 కి పైగా సినిమాలు, ఎన్నో రికార్డులు, ఎన్నో అవార్డులు, ఎన్నో సేవలు, ఎన్నో ప్రశంసలు చిరంజీవిని శిఖరం మిద నిలబెట్టాయి.. అందరివాడు చిరంజీవి నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా చిరంజీవికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొదటి కుమారుడిగా చిరంజీవి జన్మించారు. చిరంజీవికి ఇద్దరు చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు..

* కొణిదెల చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్.. తన ఇంట్లో అందరూ శంకరం బాబు అని పిలిచేవారు..

* 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణంఖరీదు ముందుగా విడుదల అయ్యింది.

* మొదటి సినిమాకి గాను అయన అందుకున్న పారితోషికం అక్షరాల 1,116 రూపాయలు..

* మంచి ప్రవర్తన, అంతకు మించి టాలెంట్ తో అవకాశాలను అందుకున్నారు చిరంజీవి.. 1978లో రెండు సినిమాలు మాత్రమే చేస్తే ఆ తర్వాత సంవత్సరం నాలుగు సినిమాలు, ఆ తర్వాత సంవత్సరం ఎనమిది సినిమాలను చేసుకుంటూ వెళ్లారు చిరంజీవి..

* మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు చిరంజీవి..

* 1983 వరకూ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన చిరంజీవి ఆ తరవాత పూర్తి స్థాయి హీరోగా మారారు..

* తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించ దగ్గ నటుడుగా మెగాస్టార్ చిరంజీవి పేరు సంపాదించుకున్నారు..

* చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980 ఫిబ్రవరి 20న జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

* 1983లో చేసిన ఖైది సినిమా చిరంజీవి స్థాయిని పెంచింది.. ఇది చిరంజీవికి 62 వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాకి ఏకంగా కోటి రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.. ఈ సినిమాకి చిరంజీవి రెమ్యునరేషన్ లక్ష డెబ్బై అయిదు వేలు.. ఇదే సినిమాని హీరో కృష్ణ హిందీలో రీమేక్ చేశారు. అక్కడ సూపర్ హిట్ అయింది. ఇదే సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. దీనితో చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు కూడా వచ్చింది.

* ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేసిన చిరంజీవి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరుకు ఎదిగి నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచారు.. నటనలోనే కాదు డాన్స్ లలో కూడా చిరు హైలెట్ అనే చెప్పాలి. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు..

* 1995, 1996 సంవత్సరంలో చిరంజీవి చేసిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.. ఇక 1997లో వచ్చిన మా అన్నయ్య మంచి హిట్ అయి చిరంజీవి క్రేజ్ ని నిలబెట్టింది. ఈ తర్వాత మాస్టర్, చూడాలని ఉంది సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు..

* ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా తనని ఇంత చేసిన అభిమానుల కోసం ఏదైనా చేయాలనీ అనుకున్న చిరంజీవి.. 1998 అక్టోబర్ లో బ్లడ్ బ్యాక్ ని స్థాపించారు.. ఆ తర్వాత ఐ బ్యాంకు కూడా స్థాపించారు. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు.

* ఇక 2002 లో వచ్చిన ఇంద్ర మూవీ చిరంజీవి స్థాయిని పెంచింది. ఇక ఠాగూర్ సినిమా తరవాత ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రావాలని భావించారు చిరంజీవి.. ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు..

* 2008 ఆగస్టు 26 న తిరుపతిలో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2009 ఎన్నికలో 18 స్థానాలని మాత్రమే గెలుచుకున్నారు. ఇక ఆ తర్వాత పార్టీని 2011, ఫిబ్రవరి 6 వతేదీన కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.

* ఒక ప్రేక్షకుల కోరిక మేరకు 2017 లో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.. ఖైది 150 తో ఆయన రీఎంట్రీ మొదలైంది.. ఈ సినిమాతో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చూపించారు చిరంజీవి.. ఇక 2019 లో తన డ్రీం ప్రాజెక్ట్ సైరా సినిమాని చేశారు చిరంజీవి.. ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు.

* చిరంజీవి అందించిన సేవలకి గాను జనవరి,2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి పద్మభూషణ్ పురస్కారం అందజేశారు.. ఇక అదే సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు.

చిరంజీవి ఇలాగే మరెన్నో సినిమాలు చేసి విజయాలను అందుకొని ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుంటూ మరోసారి అభిమాన మెగాస్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది HMTV

Show Full Article
Print Article
Next Story
More Stories