Live Updates: ఈరోజు (05 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్-తెలంగాణ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-05 03:07 GMT

ఈరోజు పంచాంగం 

ఈరోజు గురువారం | 05 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి రా.1-45 తదుపరి | ఆర్ద్ర నక్షత్రం రా.2-36 తదుపరి | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26


Live Updates
2020-11-05 05:38 GMT

కర్నూలు జిల్లా..

* శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని ఒకటవ యూనిట్ లో తలెత్తిన సాంకేతిక లోపం

* నిలిచిపోయిన 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

* ఒకటవ యూనిట్ లో తలెత్తిన సాంకేతిక‌లోపాన్ని పది రోజులలో క్లియర్ చేస్తాం : చీప్ ఇంజనీర్ నరసింహారావు

2020-11-05 05:36 GMT

 టిఎస్ హైకోర్టు :-

- హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో నష్ట పోయిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని పిటీషన్ లో పేర్కొన్న చెరుకు సుధాకర్

- కేవలం హైదరాబాద్ లో నష్ట పరిహారం ఇస్తున్నారు తప్ప, జిల్లాల్లో వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరిన పిటిషనర్

- నేడు కౌంటర్ దఖాలు చేయనున్న ప్రభుత్వం

- కొనసాగునున్న విచారణ...

2020-11-05 05:32 GMT

నల్గొండ :

* రైతు సమస్యల‌ కోసం కలెక్టరేట్ వద్దకి వెల్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికం...

* శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుంది..

* నల్గొండ జిల్లా‌ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్...

2020-11-05 05:28 GMT

హైదరాబాద్ 

* హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రయాణం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

* మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో లో ప్రయాణం

* అమీర్పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ లో మియాపూర్ ట్రైన్ ఎక్కిన పవన్ కళ్యాణ్

* రైలు లో ప్రయాణికులతో సంభాషణలు జరిగిన పవన్ కళ్యాణ్

2020-11-05 05:25 GMT

 విశాఖ

* విశాఖ స్టీలుఫ్లాంట్ టి.పి.పి 2 లో అగ్నిప్రమాదం.

* టర్బన్ అయిల్ లీక్ అవ్వటంతో చెలరేగిన మంటలు.

* 1.2 మొగావాట్లు విద్యుత్తు దగ్దం.

2020-11-05 05:14 GMT

నిజామాబాద్:

* జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి

* బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని 8 వేలు పంపాలని మెసేజ్ లు

* ఫేక్ అకౌంట్ విషయం పై తన అసలు ఖాతాలో అప్రమత్తం చేసిన కలెక్టర్

* తన పేరుతో ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వొద్దని సూచన

* పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ నారాయణరెడ్డి

2020-11-05 05:01 GMT

నెల్లూరు :--

* ఎస్సీ,ఎస్టీ సెల్ డిఎస్పీగా వై.బి.పీ.టి.ఏ ప్రసాద్.

* వెంకటగిరిలోని ఏపీఎస్పీ 9 వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా టి.రాజేష్ బాధ్యతలు స్వీకరించారు.

2020-11-05 04:59 GMT

 అమరావతి

 రామకృష్ణ.

-కరోనా విపత్తు నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించండి.

-ఏపీలో 9, 10 తరగతులకు స్కూళ్లు తెరిచి 3 రోజులు కాకముందే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా సోకటం శోచనీయం.

-ఒక్క చిత్తూరు జిల్లాలోనే 150 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకింది.

-నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పలువురు టీచర్లు, స్టూడెంట్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

-ఈ విపత్కర పరిస్థితుల్లో పాఠశాల ప్రారంభం పెను విపత్తుకు దారితీస్తుంది.

-పైగా విద్యార్థుల పూర్తి ఆరోగ్య బాధ్యత తల్లిదండ్రులదే అన్నట్లు రాతపూర్వక లేఖలు తీసుకోవటం తగదు.

-విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేయడం మానుకోండి.

2020-11-05 04:41 GMT

టీఎస్ హైకోర్టు....

* ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పైన నేడు హైకోర్టు విచారణ...

* ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని హైకోర్టు లో మూడు పిటిషన్లు ధాఖలు..

* నేడు ఎల్ఆర్ఎస్ పైన కౌంటర్ ధాఖలు చేయనున్న ప్రభుత్వం..

* నేడు మరోసారి పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు....

2020-11-05 04:34 GMT

 కృష్ణాజిల్లా...

* బందరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

* మంత్రి పేర్ని నాని

* రైతులకు గిట్టుబాటుబధర కల్పించడమే సీఎం జగన్ లక్ష్యం

Tags:    

Similar News