Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-04 02:06 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి

ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

తాజావార్తలు 

Live Updates
2020-11-04 13:44 GMT

 అమరావతి

* అక్రమార్జన, అక్రమ ఆస్తులుపై డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అధికారి కార్యాలయము, ఇండ్ల ఫై అవినీతి నిరోధక శాఖ సోదాలు

* మోతికి వెంకట శివ సత్యనారాయణ వర ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, గుంటూరు లో పనిచేస్తారు

* అక్రమ స్థిర, చరాస్తులపై గుంటూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్

* ఇల్లు, మూడు అనుబంధ ప్రదేశాలలో, గుంటూరు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్యాయంలో రైడ్స్

* 3.34కోట్ల విలువైన్ మూడు ఇళ్ళు, 6లక్షల విలువైన ఒక ఫ్లాట్ గుర్తించిన అధికారులు

* 15.64లక్షల విలువైన ఇంటి స్ధలాలు గుర్తించిన ఏసీబీ

* 2.47 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు

* 18లక్షల విలువైన బంగారం, 50లక్షలకు పైగా ఫిక్సుడ్ డిపాజిట్లు కలిగి ఉన్నట్టు గుర్తించిన అధికారులు

* లెక్కలలో చూపని 3.7 కోట్ల విలువైన ఆస్థులు కలిగి ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ

* ఏకకాలంలో గుంటూరు, విజయవాడ లలో ఏసీబీ దాడులు

2020-11-04 13:39 GMT

అనంతపురం:

* యువతి కిడ్నాప్ జరిగిన 30 గంటల్లోనే  ఛేదించిన పోలీసులు

* యువతి క్షేమం ఐదుగురు కిడ్నాపర్లను అరెస్టు.

* మూడు కార్లు స్వాధీనం

* కిడ్నాప్ ఘటనకు సూత్రధారి కర్నూలు జిల్లా అవుకు కానిస్టేబుల్ , ఆయన కుటుంబ సభ్యులు

* యువతికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకోవాలనే కిడ్నాప్ ...

* పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో కిడ్నాప్ ఘటన సుఖాంతం

* మహిళలపై నేరాలకు పాల్పడితే ఎవర్నీ ఉపేక్షించం: ఎస్పీ సత్య ఏసుబాబు.

2020-11-04 13:03 GMT

  తిరుపతి

* స్కూళ్లు తెరవడంతో టీచర్లు, స్టూడెంట్స్ కు వ్యాపిస్తున్న కరోనా

* గడిచిన 2 రోజుల్లోనే 150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్

* కోవిడ్ పరీక్షల కోసం క్యూ కడుతున్న టీచర్లు

* ఈనెల 8లోపు పరీక్షలు చేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశం

2020-11-04 11:34 GMT

  అమరావతి..

-ట్రైబల్ సబ్ ప్లాన్ పటిష్టంగా అమలు చేయండి.

-నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోండి.

-టీఎస్పీ నిధులన్నీ గిరిజనులకే చెందేలా చూడండి.

-ఆదివాసీ ఆరోగ్యం, ఫీడర్ ఆంబులెన్స్ లను కొనసాగించండి.

-శాఖపై సమీక్షలు చేయండి.. పర్యవేక్షణ పెంచండి

-అధికారులకు పుష్ప శ్రీవాణి దిశానిర్దేశం

2020-11-04 11:27 GMT

అమరావతి..

-259 ఎకరాల పరిధిలోని బ్రహ్మదిహా బ్లాక్ లోని కోకింగ్ కోల్ బొగ్గును మైనింగ్ చేయనున్న ఏపీఎండీసీ

-కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంస్ టీసీ నిర్వహించిన బిడ్డింగ్ లో కోకింగ్ కోల్ బ్లాక్ ను దక్కించుకున్న ఏపీఎండీసీ

-ఏడాదికి 0.15 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వితీసుకునేందుకు అవకాశం

2020-11-04 11:14 GMT

తూర్పుగోదావరి :

పి.గన్నవరం

-అంబాజీపేట మం. గంగలకుర్రు అగ్రహారం హైస్కూలు లో జిల్లా వైద్యశాఖ అధికారుల తనిఖీలు..

-నిన్న మిడ్ డే మీల్ వర్కర్ కు కరోనా నిర్ధారణ కావడంతో విద్యార్ధులకు ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించనున్న అధికారులు..

2020-11-04 11:12 GMT

శ్రీకాకుళం జిల్లా..

-రాజాం GMR IT కాలేజీలో సెమిస్టర్ పరీక్ష వాయిదా..

-పరీక్షకు హాజరైన విద్యార్థికి కరొణ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వాయిదా పడిన సెమిస్టర్ పరీక్ష..

2020-11-04 11:02 GMT

అమరావతి..

-సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో అధికారులతో జరుగుతున్న సమీక్ష.

-పనుల్లో జాప్యం సహించేది లేదని మంత్రి హెచ్చరిక.

-సామగ్రి సరఫరా చేయని కంపెనీల అగ్రిమెంట్ లు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు.

2020-11-04 10:54 GMT

నెల్లూరు :

 మంత్రి బాలినేని కామెంట్స్..

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలలో 90 శాతం అమలులో ఉన్నాయి..

-బిసిలలో ఇన్ని కులాలు ఉన్నాయని వెలికి తీసి వాళ్ళని రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ ది

-బీసీలను వాడుకొని ,ఆతర్వాత అనగదొక్కిన చరిత్ర చంద్రబాబు ది

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలుకు టీడీపీ వాళ్ళు కూడా ఆకర్షితులవు తున్నారు....

-ఇంకో 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు....

2020-11-04 10:49 GMT

నెల్లూరు :

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్

-దేశంలో బిసిలకు పదవులు,అందులో 50 శాతం మహిళలకు ఇవ్వడం ఒక వండర్

-నేను ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేను.

-ఏపీ కి జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి గా వుంటారు...ప్రజలు ఆయన్ని ఆరాధిస్తున్నారు..

-బిసి,ఎస్సి,ఎస్టీ ,మైనారిటీ లు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుంటున్నారు..

-బిసి లు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు...బాక్ బోన్ క్లాస్ అని జగన్మోహన్ రెడ్డి నిరూపించారు..

-అచ్చంనాయుడు జైలు కి పోవడానికి కారణం చంద్రబాబే

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల నేడు 2 కోట్ల మంది బిసిలకు లబ్ధిపొందుతున్నారు..

-కరోనా నేపధ్యంలో తొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకోసం చంద్రబాబు ఒక్కరోజు కూడా ఏపీ కి రాలేదు...

-ఆయన కొడుకు ఏపీ కి టూరిస్ట్ లా వచ్చి పోతున్నాడు

-పెద్ద పప్పు మహరాజ్ లోకేష్ ....ఆంధ్ర పప్పు అని గూగుల్ లో కొడితే నీపేరే వస్తుంది...మమ్మల్ని ఏమిచేయమంటావ్

-బాబు అధికారంలో వుంటే బిసిలు బిజినెస్ క్లాస్. అవుతారు..ప్రతిపక్షనలో ఉంటె బిసిలు బ్యాక్ వార్డ్ అయిపోతారు

Tags:    

Similar News