Health Tips: పసుపుతో సులువుగా బరువు తగ్గండి.. ప్రతిరోజు ఇలా చేస్తే చాలు..!

Health Tips: పసుపుతో సులువుగా బరువు తగ్గండి.. ప్రతిరోజు ఇలా చేస్తే చాలు..!

Update: 2022-11-20 14:13 GMT

Health Tips: పసుపుతో సులువుగా బరువు తగ్గండి.. ప్రతిరోజు ఇలా చేస్తే చాలు..!

Health Tips: పసుపును ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. పసుపు ఆహారానికి రంగు ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పసుపులో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే దీనిని పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఔషధాల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. అయితే పసుపుని బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది చాలామందికి తెలియదు. అది ఎలాగో తెలుసుకుందాం.

పసుపు మన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. స్థూలకాయం ఉన్నవారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు పసుపును తీసుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఒబెసిటీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతాయి.ఒక గ్లాసు పాలు తీసుకొని బాగా వేడి చేయాలి. అందులో అందులో ఒక చెంచా పసుపు వేసి బాగా మిక్స్ చేసి తాగాలి.

పసుపు, దాల్చినచెక్క టీ

ఒక గిన్నెలో కప్పు నీరు పోసి అందులో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ నీరు సగం ఇంకేవరకు మరగబెట్టాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ తాజా పసుపు, పుదీనా ఆకులు వేసి వడపోసి తీసుకోవాలి. ఇలా తాగితే సులువుగా బరువు తగ్గుతారు. పసుపు ఒక యాంటీ బయాటిక్. దీనిని చిన్న చిన్న గాయలు మానడానికి కూడా ఉపయోగిస్తారు. అందుకే భారతదేశంలో పసుపు లేని వంటిళ్లు ఉండదనే చెప్పాలి.

Tags:    

Similar News